దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

ABN , First Publish Date - 2020-10-27T10:38:53+05:30 IST

విజయదశ మి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలను సోమవారం నిమజ్జనా నికి మంచిర్యాల గోదావరికి తరలించారు

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

దుర్గామాత ఊరేగింపులో రబస


మందమర్రిటౌన్‌, అక్టోబరు 26 :  విజయదశ మి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలను సోమవారం నిమజ్జనా నికి మంచిర్యాల గోదావరికి తరలించారు. మండ పాల వద్ద ఉద్వాసన పూజలను నిర్వహించారు.  వెంకటేశ్వరాలయం, సాయిబాబా ఆలయంలో దుర్గామాతను దర్శించుకున్నారు. మాలధారణ చేసిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.  


దండేపల్లి:  గూడెం దుర్గామాత మండపం వద్ద సోమవారం మహా చండియాగం నిర్వ హించారు. వేద మంత్రోచ్చరణ నడుమ లక్ష్మీ గణపతి, సుదర్శనయాగం, మృతుంజయ చండీ యాగంతోపాటు దుర్గామాతకు అనురిద్‌ ఆఽధ్వ ర్యంలో పూజలను నిర్వహించారు. భక్తులు మం డపం వద్ద దీపాలకరణ చేశారు. సురేందర్‌ స్వామి దీపిక, శ్రీనివాస్‌ మమత, అనిల్‌ హిమ బిందు,  శ్రీనివాస్‌ వందన  పాల్గొన్నారు.  


మంచిర్యాల కలెక్టరేట్‌: సర్వజనని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం దుర్గాదేవికి 108 దీపాలు, 108 బిల్వపత్రులతో నవమి పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం నిర్వహిం చారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి నృ త్యాలు చేశారు. విశ్వనాథ కళాక్షేప మండపం నుంచి బయలుదేరి ముఖరాం చౌరస్తా మీదుగా  గోదావరిలో నిమజ్జనం చేశారు.  బోడ ధర్మేందర్‌, రీనారాణిదాస్‌, ప్రియ సర్కార్‌, దేవి పవిత్ర, పూర్ణదత్త, దేవి శ్రీనాథ్‌, అమిత్‌ దత్తపాల్గొన్నారు. 


ఊరేగింపులో రభస

మంచిర్యాల: దుర్గామాత నిమజ్జన ఊరేగింపు లో రభస చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని లక్ష్మీగణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గా మాతను సోమవారం నిమజ్జనం చేశారు.  ఆల య కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు ఏర్పాటు చేయగా మహిళలు, ప్రజలు తరలివచ్చారు. మహిళలు కోలాటాలు, నృత్యాలతో అలరింపజేశా రు. అటువైపు వచ్చిన టూటౌన్‌ ఎస్సై రాజమౌళి గౌడ్‌ త్వరగా నిమజ్జనానికి తరలించాలని ఆదే శించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య వాదోప వాదాలు చేటుచేసుకున్నాయి. ఎస్సై లాఠీతో  కొట్టాడని పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూధన్‌రావు, ప్రధాన కార్యదర్శి మల్లేష్‌, కార్యదర్శి మల్యాల శ్రీనివాస్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, రంగ శ్రీశైలం, తదితరులు పోలీసుల వైఖరిపట్ల నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగా రు. దీంతో ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసు కుంది. ఎస్సై క్షమాపణ చెప్పాలని మహిళలు పట్టుబట్టడంతో ఎస్సై తాను తప్పుచేసి ఉంటే క్షమించాలని అన్నారు. పట్టణ సీఐ ముత్తి లిం గయ్య సంఘటన స్థలానికి చేరుకొని మాట్లాడా రు. అవసరమైతే తాను కూడా క్షమాపణ చెప్తా నని సీఐ అనడంతో ప్రజలు శాంతించారు. అనం తరం దుర్గామాతను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.   

Updated Date - 2020-10-27T10:38:53+05:30 IST