విద్యుదాఘాతంతో హార్వెస్టర్‌ ఆపరేటర్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-01T06:14:43+05:30 IST

బాసర మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో హర్యానాకు చెందిన బేహనా(22) అనే వ్యక్తి మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో హార్వెస్టర్‌ ఆపరేటర్‌ మృతి
విద్యుత్‌షాక్‌తో చనిపోయిన హర్యానాకు చెందిన బేహనా

బాసర, నవంబరు 30 : బాసర మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో హర్యానాకు చెందిన బేహనా(22) అనే వ్యక్తి మృతి చెందాడు. హార్వెస్టర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సదరు వ్యక్తి విద్యుత్‌ తీగలను చూసుకోకుండా లారీని నడిపారు. లారీపై హార్వెస్టర్‌ ఉంది. 11 కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి ప్రమాదం చోటు చేసుకుంది. లారీపై ఉన్న హార్వెస్టర్‌కు తీగలు తగలగానే బేహన్‌తో పాటు మరొ ఇద్దరు కిందికి దూకారు. ఆ తరువాత విద్యుత్‌ సరఫరా ఉన్న వాహనాన్ని బేహనా ముట్టు కోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాసర ఎస్సై ప్రేమ్‌దీప్‌ తన వాహనం లో ఆసుపత్రికి తరలించి నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

Updated Date - 2020-12-01T06:14:43+05:30 IST