31 వరకు ట్రిపుల్‌ ఐటీకి సెలవులు

ABN , First Publish Date - 2020-03-16T12:06:20+05:30 IST

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మల్‌ జిల్లా బాసరలోని వైజ్ఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రీపుల్‌ఐటీ)కి అధికారులు...

31 వరకు ట్రిపుల్‌ ఐటీకి సెలవులు

బాసర, మార్చి15: కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మల్‌ జిల్లా బాసరలోని వైజ్ఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రీపుల్‌ఐటీ)కి అధికారులు సెలవులను ప్రకటిం చారు. ఈనెల 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఆదివారం పరిపాలనాధికారి రాజేశ్వర్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో యూనివర్సిటీలో చ దువుతున్న ఏడువేలన్నర మంది విద్యార్థులు తమ సొంత ఊర్లకు బయలు దేరారు. యూనివర్సిటీ పునఃప్రారంభ విషయం తరువాత తెలియజేస్తామని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. 


Updated Date - 2020-03-16T12:06:20+05:30 IST