బాసరలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2020-12-12T05:02:24+05:30 IST

బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తుల రద్దీ పోటెత్తింది.

బాసరలో భక్తుల సందడి
అక్షర శ్రీకార పూజలు జరిపిస్తున్న భక్తులు

బాసర, డిసెంబరు 11 :  బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తుల రద్దీ పోటెత్తింది. శ్రావణ మాసం చివరి శుక్రవారానికి తోడు ఏకాదశి కలిసి రావడంతో అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదా వరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. శుభదినం కావడంతో అక్షరశ్రీకారపూజలు భారీగా నమోదయ్యాయి. తెలంగాణ తో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు ఽఅధికసంఖ్యలో హాజరయ్యారు. అమ్మ వారి  సన్నిధిలో తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. చాలా రోజుల తరువాత అక్షర శ్రీకార మండపాలు భక్తులతో కళకళలాడాయి. 

Updated Date - 2020-12-12T05:02:24+05:30 IST