నులి పురుగుల నిర్మూలతోనే పిల్లలకు ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-02-11T11:18:35+05:30 IST

నులి పురుగుల నిర్మూలనతోనే పిల్లలకు, విద్యార్థులకు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ భీష్మ పేర్కొన్నారు...

నులి పురుగుల నిర్మూలతోనే పిల్లలకు ఆరోగ్యం

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 10 :  నులి పురుగుల నిర్మూలనతోనే పిల్లలకు, విద్యార్థులకు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ భీష్మ పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల ఆవరణలో జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆల్బెండ జోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  1 నుంచి 19 సంవత్సరాలలోపు వయస్సు గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆల్బెండ జోల్‌ మాత్రలను అంజేస్తున్నామన్నారు. 1 నుంచి 2 సంత్సరాలలోపు పిల్లలకు సగం మాత్రను పొడిచేసి నీటిలో కరిగించి వేయాలని తెలిపారు. డిప్యూటీ డీఎంఎహెచ్‌ఓ, ప్రోగ్రాం అధికారి ఫయాజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ పిల్లలు ఆహారం తినే ముందు మల, మూత్ర విసర్జన తరువాత  చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, బయటి ప్రదేశాలలో చెప్పులు లేకుండా తిరగకూడదన్నారు. సోమవారం మాత్రలు అందని చిన్నారుల కోసం వాపప్‌డే సందర్భంగా ఈనెల 17న పిల్లలకు ఆల్బెండ జోల్‌ మాత్రలు అందే లా చూడాలన్నారు. పాఠశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్‌, జూనియర్‌ కళాశాలల పిల్లలందరికీ నులి పురుగుల మందులు అందేలా చూడాలన్నారు. 1 నుంచి 6 వతరగతి విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఈ మాత్రలు కచ్చితంగా అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యమంలో వైద్యాధికారి వంశీ కృష్ణ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సీహెచ్‌ఓ జ్ఞాన సుందరి, సబ్‌ యూనిట్‌ అధికారి గుంటేటి నాందేవ్‌, కేజీబీవీ ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, ఆర్‌బీఎస్‌కె సిబ్బంది, రాజీవ్‌నగర్‌ ఆరోగ్య కేంద్ర సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-11T11:18:35+05:30 IST