హెచ్‌బీటీలకు వేతనాలు ఎప్పుడు..?
ABN , First Publish Date - 2020-12-21T03:37:04+05:30 IST
ఆదర్శ పాఠశాలల్లో అవర్లీ బేస్డ్ విధానం (హెచ్‌బీటీ)లో పని చేస్తున్న ఉపాధ్యాయులను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.

రెన్యూవల్‌కూ నోచుకోని మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులు
రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు
ఆన్‌లైన్ తరగతులు బోధిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
మంచిర్యాల, డిసెంబరు 20 (మంచిర్యాల): ఆదర్శ పాఠశాలల్లో అవర్లీ బేస్డ్ విధానం (హెచ్‌బీటీ)లో పని చేస్తున్న ఉపాధ్యాయులను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మోడల్ స్కూళ్లలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తూ విద్యా ప్రమాణాల మెరుగునకు కృషి చేస్తున్నా టీచ ర్లకు వేతనాలు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తోంది. గంటకు రూ.140 చొప్పున నెలలో 100 గంటలకు మించకుండా పనిచేసే హెచ్‌బీటీలకు నెలకు రూ.14 వేల వేతనం చెల్లించాల్సి ఉంది. కొవిడ్ వైరస్ కార ణంగా ఇప్పటి వరకు పాఠశాలలు తెరుచుకోకపోవ డంతో ప్రభుత్వం హెచ్‌బీటీలకు వేతనాలు ఇవ్వడం లేదు. ఆగస్టు 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమై పాఠాలు బోధిస్తున్నా వేత నాలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ స్కూళ్ల లో 6 నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన జరుగుతుండగా వెయ్యికి పైగా హెచ్‌బీటీలు పని చేస్తున్నారు.
ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైనా...
కొవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం కాకపోయినప్పటికీ ఆగస్టు 27 నుంచి ఆన్‌లైన్ విధానంలో బోధన కొనసాగుతోంది. హెచ్‌బీటీలు నాలుగు నెలలుగా విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వేతనాలు విడుదల చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు మినహా మిగతా ఉపాధ్యాయులందరూ హెచ్‌బీటీలే కావడం గమనా ర్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 పాఠ శాలల్లో హెచ్‌బీటీలే విద్యాబోధన చేస్తున్నారు. మం చిర్యాల, కాసిపేట, కోటపల్లి, నార్నూర్, సిర్పూర్ (యూ), గుడిహత్నూర్, బోథ్ మోడల్ స్కూళ్లలో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఆన్‌లైన్ పాఠాలను హెచ్‌బీటీలే బోధిస్తున్నా రు. ఇస్తున్న అరకొర వేతనం కూడా రాకపోవడంతో హెచ్‌బీటీలు దినసరి కూలీలుగా, ఇతర పనుల్లో చేరు తున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ ల్లోని ఉపాధ్యాయులకు వేతనాలు వస్తుండగా కేవలం మోడల్ స్కూళ్లలోని హెచ్‌బీటీలకు మాత్రమే వేతనా లు లేవు. అయితే ఆయా పాఠశాలల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైన కంప్యూటర్ ఆపరేటర్, వాచ్‌మన్, అటెండర్, వ్యాయామ ఉపాధ్యాయులకూ వేతనాలు అందుతున్నాయి. ఈ పాఠశాలలకు అను బంధంగా ఉన్న వసతి గృహాలు తెరుచుకోకపోయినా వాటిలో పని చేస్తున్న వంట మనుషులు, కేర్‌టేకర్లు, ఏఎన్‌ఎం, వాచ్‌ఉమన్‌కు మార్చి నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాల విషయమై 17 స్కూళ్ల హెచ్‌బీటీలు ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకుండా పోయింది.
రెన్యూవల్‌కు నోచుకోని హెచ్‌బీటీలు...
రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌బీటీలపై ఆధారపడి నడుసు ్తన్న 17 పాఠశాలల్లో దాదాపు 340 మంది ఉపాధ్యా యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆయా జిల్లాల ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ పాఠశాలల ప్రిన్సిపాళ్లు పిలవడంతో ఆగస్టు 27 నుంచి ఆన్‌లైన్ తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థులకు వర్క్ షీట్లు అందించడం, ఇంటర్ అడ్మిషన్లు, జూమ్‌లో క్లాసులు చెప్పడం తదితర పనులన్నీ చేస్తున్నారు. అయితే ఆయా ప్రిన్సిపాళ్ల మౌఖిక ఆదేశాలతోనే వారంతా పని చేస్తుండగా నాలుగు నెలలుగా వేతనాలు లేవు. తరగ తులు బోధించాలని ఆహ్వానించిన ప్రిన్సిపాళ్లు సైతం మౌనం వహిస్తుండటంతో హెచ్‌బీటీలు తీవ్ర ఆవేద నకు గురవుతున్నారు. మిగతా మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న హెచ్‌బీటీలకు జూన్ నుంచి వేతనాలు అంద కపోగా, అక్కడి రెగ్యులర్ ఉపాధ్యాయులే ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నారు. అయితే పాఠశాలలు, కళాశా లలు తెరవకున్నా జీతాలు చెల్లించాలని, ఉపాధ్యాయు లను తొలగించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీఓ 45 జారీ చేసింది. అయినప్పటికీ హెచ్‌బీటీలను రెన్యూవ ల్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేతనాలు చెల్లించాలి...
విజయగిరి మహేష్, హెచ్‌బీటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న హెచ్‌బీటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వేతనాలు చెల్లించాలి. వేతనాలు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ప్రోత్సహిస్తే విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం.
కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది....
వెంకటేష్, హిందీ హెచ్‌బీటీ లింగాపూర్
ఎనిమిది నెలలుగా వేతనాలు లేక కుటుంబ పోష ణ భారంగా మారింది. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా వేతనాలు చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.