దుప్పిపిల్లను ఫారెస్ట్‌ అధికారులకు అప్పగింత

ABN , First Publish Date - 2020-12-27T05:55:52+05:30 IST

మండలంలోని మల్లాపూర్‌ గ్రామానికి చెందిన సీదర్ల వెంకన్న పంటచేనులోకి దుప్పిపిల్ల రావడంతో గ్రామసర్పంచ్‌ సీదర్ల భూమేష్‌ ఇందన్‌పెల్లి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు.

దుప్పిపిల్లను ఫారెస్ట్‌ అధికారులకు అప్పగింత
దుప్పి పిల్లను ఫారెస్ట్‌ అధికారులకు అప్పగిస్తున్న దృశ్యం

దస్తూరాబాద్‌, డిసెంబరు 26 : మండలంలోని మల్లాపూర్‌ గ్రామానికి చెందిన సీదర్ల వెంకన్న పంటచేనులోకి దుప్పిపిల్ల రావడంతో గ్రామసర్పంచ్‌ సీదర్ల భూమేష్‌ ఇందన్‌పెల్లి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. కాగా వారు అక్కడికి చేరుకొని దుప్పిపిల్లను తీసుకొని వెళ్లారు. రైతు వెంకన్నను, సర్పంచ్‌ను అధికారులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌ తిరుపతి, ఫారెస్ట్‌ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T05:55:52+05:30 IST