కర్ఫ్యూకు జై
ABN , First Publish Date - 2020-03-23T09:45:41+05:30 IST
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న భయంకర కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన జనతా కర్య్పూ ఆదివారం జిల్లా అంతటా రె ట్టింపు స్థాయిలో...

- స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపిన జనం
- మహారాష్ట్ర సరిహద్దుల దిగ్బంధం
- వెలవెలబోయిన ఎన్‌హెచ్ - 44
- ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసు పహారా
- పర్యవేక్షించిన ఎస్పీ శశిధర్ రాజు
నిర్మల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న భయంకర కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన జనతా కర్య్పూ ఆదివారం జిల్లా అంతటా రె ట్టింపు స్థాయిలో విజయవంతం అయ్యింది. ప్రజలంతా స్వ చ్ఛందంగా జనతా కర్య్పూకు జై కొట్టి తమ ఇండ్ల నుంచి కదలకుండా కుటుంబ సభ్యులతో గడిపారు. గత రెండు రో జుల నుంచి జనతా కర్య్పూపై రెవెన్యూ, పోలీసు వర్గాలతో పాటు సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరగడం తో జనంలో దీనిపై అవగాహన పెరిగింది. దీని కారణంగా నే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ప్రజలంతా తమ ఇండ్లలోనే ఉండి జనతా కర్య్పూకు మ ద్దతు పలికారు.
ఓ వైపు సెల్‌ఫోన్‌లు , మరోవైపు వ్యాపార లావాదేవీలతో బిజీగా మారిన జనమంతా చాలా రోజుల తరువాత జనతా కర్ఫ్యూ పుణ్యమాణి ఇండ్లకే పరిమితం అవుతూ కుటుంబ సభ్యులతో గడిపారు. ఏళ్ల అనంతరం దాదాపు 85శాతం పైగా కుటుంబాలు ఇండ్లలోనే గడిపి త మ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఉదయమే రో డ్లపైకి చేరుకొని జనాన్ని కట్టడి చేయగలిగారు. పోలీసులు పర్యవేక్షణకే పరిమితం కావాల్సి వచ్చింది. జనం స్వచ్చందంగా బయటకు రాకపోవడంతో జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ లాంటి పట్టణాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎస్పీ శశిధర్ రాజు ఉదయం నుంచే స్వయంగా జనతా కర్య్పూ పరిస్థితులను సమీక్షించారు. ఎక్కడ కూడా ఇతర శాఖల ఉన్నతాధికారులు మాత్రం కనిపించకపోవడం చర్చకు తావిచ్చింది. ఎస్పీ మహరాష్ట్ర సరిహద్దులోని బెల్ తరోడా చెక్‌పోస్టు వద్దకు కూడా వెళ్ళి మహరాష్ట్ర వాసులు సరిహద్దులు దాటకుండా చూడాలని ఆదేశించారు. సరిహద్దులపై ఆయన గంటకోసారి సంబందిత అదికారులతో సమీక్ష జరిపారు. కాగా నిర్మల్ గుండా వెళ్ళే 44వ జాతీయ రహదారి జనతా కర్య్పూతో వెలవెలబోయింది.
పోలీసులు గంజాల్ చెక్‌పోస్టు వద్ద మకాం వేసి వాహనాల రాకపోకలకు నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా కరోనా వైరస్‌కు సంబందించిన చర్చ జరిగింది. ప్రజలు అనూహ్యంగా జనతా కర్య్పూలో స్వచ్చందంగా పాల్గొని తమ వంతు పాత్ర పోషించడం గమనార్హం. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన పెరగడంతో అక్కడి గ్రామస్థులు స్వచ్చదంగా జనతా కర్య్పూలో పాల్గొన్నారు. యువజన సంఘాలు , ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు , ఆయా గ్రామాల విడిసిలు , స్వచ్చందం సంస్థలు కూడా జనతా కర్య్పూపై విసృత ప్రచారం చేసి ప్రజల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యాయి. ఎక్కడ కూడా దుకాణాలు , పెట్రోల్ బంక్‌లు , హోటళ్ళు తెరవలేదు. కూరగాయల మార్కెట్‌లు, మటన్, చికెన్ సెంటర్‌లు సైతం తెరవలేదు. వ్యాపార వాణిజ్య సంఘాలు జనతా కర్ఫ్యూలో పా ల్గొంటున్నట్లు ప్రకటించాయి. దీంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోగా కరోనా వైరస్ నివారణ కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలందరికి కొంత మేరకైనా అవ గాహన కలిగిందని పేర్కొంటున్నారు.
ఇళ్లల్లోనే జనం..
జిల్లా వ్యాప్తంగా ప్రతి వ్యక్తి తమ కుటుంబంతో పాటు ఇండ్లలోనే గడిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో వ్యక్తులే కాకుండా కుటుంబాలకు కుటుంబాలు స్వచ్చందంగా సం ఘీభావం తెలిపి ఏ ఒక్కరూ కూడా గడపదాటలేదు. తమ కుటుంబ సభ్యులతోనే ఇంట్లో ఏంజాయ్ చేశారు. చాలా ఏ ళ్ల తరువాత ఇంటి పెద్దలు, పిల్లలంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లోనే గడిపిన సందర్భాలు అరుదు అని చె బుతున్నారు. అలాంటిది జనతా కర్య్పూ కారణంగా కుటుం బాలన్ని ఇండ్లకే పరిమితమై టివిలు, సెల్‌ఫోన్‌లు చూస్తూ కాలక్షేపం చేశారు. రుచికరమైన వంటలు చేసుకుంటూ బ యట వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టేశారు.
మహారాష్ట్ర సరిహద్దుల్లో దిగ్బంధం..
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత పెరగడమే కాకుం డా ఇక్కడి పలువురికి కరోనా విషయంలో పాజిటివ్ రిపోర్టులు రావడంతో నిర్మల్ జిల్లా పోలీసు యంత్రాంగం అ ప్రమత్తమైంది. ఇందులో భాగంగానే మహరాష్ట్ర పోలీసు లు దిగ్బంధించారు. బెల్ తరోడా చెక్‌పోస్టుతో పాటు సా రంగాపూర్ మండలంలోని సిర్‌పల్లి వద్ద గల చెక్‌పోస్టు వ ద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు మహరాష్ట్ర వైపు నుంచి ఏ ఒక్కరు జిల్లాకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్పీ శశిధర్ రాజు మహరాష్ట్ర సరిహద్దుల దిగ్బంధంపై సీరియస్‌గా వ్యవహరించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఎస్పీ మహరాష్ట్ర నుంచి జిల్లాలోని ప్రవేశించే ప్రధాన మార్గాలతో పాటు పి ల్ల మార్గాలు, ఇతర పంట చేల, అడవి మార్గాలపై కూడా దృష్టి పెట్టారు.
ఈ మార్గాలన్నీంటిపై పోలీసుల నిఘా పె ట్టారు. ఏ ఒక్కరు కూడా మహారాష్ట్ర నుంచి జిల్లా సరిహద్దులోకి అడుగు పెట్టవద్దని జిల్లాకు చెందిన వారు కూడా మహారాష్ట్రకు వెళ్లవద్దంటూ ఎస్పీ శశిధర్ రాజు ఆదేశించారు. మొత్తానికి సరిహద్దుల గుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడమే ఎస్పీ తన లక్ష్యంగా పెట్టుకున్నా రు. సోషల్ డిస్టెన్స్‌ను పాటించేలా సానిటైజర్, మాస్క్‌ల ఉపయోగంలో కూడా పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
కనిపించని ఇతర శాఖల ఉన్నతాధికారులు..
జిల్లాకు దిశా నిర్దేశం చూపాల్సిన ఉన్నతాధికారులు జ నతా కర్ఫ్యూ సందర్భంగా కనిపించకపోవడం పట్ల చర్చ జరుగుతోంది. సదరు ఉన్నతాధికారి జనతా కర్య్పూతో పా టు అవగాహన కార్యక్రమాలపై ఆశించిన మేరకు సీరియస్‌గా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఉన్నతాధికారి మిగతా అన్ని శాఖల ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేయాల్సి ఉన్నప్పటికి కడెం ప్రాంతంలో పర్యటిస్తుండడం చర్చకు తావిస్తోంది. కడెం ప్రాజెక్ట్ వద్ద గల హరిత రిసార్ట్‌లో ఈ ఉన్నతాధికారి తన మిత్రలతో గడిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎస్పీ శశిధర్ రాజు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు జనతా కర్య్పూ కోసమే కాకుండా దీనిపై అవగాహన కోసం కాళ్ళకు బలపం కట్టిన రీతిలో తిరగడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎస్పీతో పాటు డిఎస్పీలు సిఐలు , ఎస్‌ఐలు, మిగతా సిబ్బంది కూడా జనతా కర్య్పూలో సీరియస్‌గా భాగస్వాములయ్యారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నాలుగైదు రోజుల నుంచి శ్రమిస్తున్నా రు. మిగతా శాఖల కిందిస్థాయి అ ధికారులు సిబ్బంది స హకరిస్తున్నప్పటికీ కొంతమంది ఉ న్నతాధికారులు వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.