అవయవ తరలింపునకు గ్రీన్ చానెల్
ABN , First Publish Date - 2020-12-10T06:40:53+05:30 IST
అవయవ తరలింపునకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు.

ఐదు నిముషాల్లో గ్లోబల్ నుంచి కిమ్స్ ఆస్పత్రికి
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): అవయవ తరలింపునకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. లక్డీకాపుల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వరకు ఉన్న 5.6 కి.మీ. దూరాన్ని కేవలం 5నిముషాల వ్యవధిలో చేరేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ ఆస్పత్రి నుంచి ఉదయం 9.35గంటలకు ఊపిరితిత్తులతో బయలు దేరిన అంబులెన్స్ 9.40గంటలకు కిమ్స్ ఆస్పత్రి చేరుకుంది. ఈ ఏడాది అవయవ తరలింపునకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయడం ఇది 20వ సారి అని అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు.