అభివృద్ధికే గ్రేటర్ ప్రజల పట్టం
ABN , First Publish Date - 2020-12-05T06:28:04+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చి అభివృద్ధికే పట్టం కట్టారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ కల్చరల్, డిసెంబరు 4 : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చి అభివృద్ధికే పట్టం కట్టారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఫలితాలపై మంత్రి శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపు మొగ్గు చూపారనడానికి గ్రేటర్ ఫలితాలు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ప్రజలు విశ్వసించారన్నారు. అందుకే కులమతాలకతీతంగా తీర్పు నిచ్చారన్నారు. తాను ప్రచారబాధ్యత చేపట్టిన బంజారాహిల్స్ అభ్యర్థి విజయలక్ష్మీ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తి చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.