కన్నెపల్లి మండలంలో మిడతల కలకలం

ABN , First Publish Date - 2020-06-04T09:43:15+05:30 IST

మండలంలోని నాయకునిపేట గ్రామ శివారులో ప్రాణ హిత కాలువ ఒడ్డుకు మిడతలు వచ్చినట్లు సర్పంచు ఒడ్డేటి హంసహ

కన్నెపల్లి మండలంలో మిడతల కలకలం

కన్నెపల్లి, జూన్‌ 3: మండలంలోని నాయకునిపేట గ్రామ శివారులో ప్రాణ హిత  కాలువ ఒడ్డుకు మిడతలు వచ్చినట్లు సర్పంచు ఒడ్డేటి హంసహ న్మంతు, ప్రజలు తెలిపారు. మండల ఏవో శ్రీకాంత్‌కు సమాచారం అందిం చారు. ఆయన పరిశీలించి మిడతలను ఫొటోలను తీసి శాస్త్రవేత్తలకు పంపిం చినట్లు ఏవో తెలిపారు. దీని వల్ల నష్టమేమీ లేదని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి వీరయ్య ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.  జిల్లేడు చెట్లపై ఈ మిడతలు రావడం మామూలేనని ప్రస్తుతం కూడా ఎండిన జిల్లేడు చెట్లపై ఇవి కనిపించాయని వారు పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-04T09:43:15+05:30 IST