ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు..?

ABN , First Publish Date - 2020-11-17T10:19:30+05:30 IST

వరి కోతలు మొదలై పది రోజులవుతోంది. కోతలు పూర్తి చేసుకున్న రైతులు కళ్లాల్లోనే ధాన్యం రాశులు పోసుకొని పడిగాపులు కా స్తున్నారు. ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభం కాలే దు. చుట్ట పక్క జిల్లాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి

ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు..?

జిల్లాలో కొనసాగుతున్న వరి కోతలు

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

దొడ్డు రకాలే సేకరిస్తాంటున్న అధికారులు

సన్నాలపై ఇంకా రాని స్పష్టత

 

నెన్నెల, నవంబరు 16:  వరి కోతలు మొదలై పది రోజులవుతోంది. కోతలు పూర్తి చేసుకున్న రైతులు  కళ్లాల్లోనే ధాన్యం రాశులు పోసుకొని పడిగాపులు కా స్తున్నారు. ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. చుట్ట పక్క జిల్లాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. సెంటర్ల ఏర్పాటులో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.  కొనుగో లు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం సేకరణ ప్రారంభించినా దొడ్డు రకాలనే కొంటామని అధికారు లు చెబుతున్నారు. నియంత్రిత పంటల సాగులో భా గంగా ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో సన్న రకా లను పెద్ద ఎత్తున సాగు చేశారు. దొడ్డు వడ్లతో పోల్చుకుంటే సన్నాల దిగుబడి సగమే వస్తోందని, ప్రభుత్వం సన్నరకాలకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయకపోతే పెట్టుబడులు చేతికి రావని రైతులంటున్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే  ధాన్యం సేక రణ ప్రారంభించాలని, సన్నరకం ధాన్యానికి  క్వింటా లుకు రూ. 2500లకు తగ్గకుండా ప్రభుత్వమే కొనుగో లు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


3లక్షల 48వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి

జిల్లాలో 1,71,195 (68,478 హెక్టార్లు) ఎకరాల్లో వరి సాగైంది. 3లక్షల 48వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1.65 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ గ్రేడ్‌కు రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 మద్ద తు ధర చెల్లించి కొనుగోళ్లు చేపట్టనున్నారు.  డీఆర్‌డీ ఏ ఆధ్వర్యంలో 100, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 110, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 34, మెప్మా ఆధ్వర్యంలో 4, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 2 కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయనున్నారు. రైతుల సహాయార్థం జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూం ఫోన్‌నం. 6303928683, రాష్ట్ర స్థాయిలో 1800-425-00333 టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు.  


సన్నాలపై రాని స్పష్టత

సన్న రకాలు సాగు చేసిన రైతులు పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. సన్నాల కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గ దర్శకాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా లో 1,40,220 ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. 2.80 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఎక్కువ మొత్తంలో సన్నాలు సాగు కాగా సన్నరకం ధాన్యం సేకరణ గూర్చి అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో రైస్‌మిల్లర్లు, వ్యాపారులను ఆశ్రయిస్తే ధరను పూర్తిగా తక్కువకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. సాధారణ రకాలు చెల్లిస్తున్న మద్దతు ధర కూడా సన్నాలకు దక్కే పరిస్థితి లేదు. కనీసం పెట్టుబడులైన చేతికి రాదేమోనని, చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. సన్నాలకు క్వింటాలుకు  రూ.2,500లు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాల ని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి-జటోత్‌ లచ్చన్న, లంబాడితండా, నెన్నెల  

కోతలు పూర్తయ్యాయి. ధాన్యం రాశులు పోసుకొని కొనేవారి కోసం ఎదురు చూస్తున్నాం. నిరుడు కళ్లాల్లో కుప్పలు ఉన్నప్పుడే వర్షాలు రావడంతో ధాన్యం తడిసి నష్టపోయాం. ధాన్యం సేకరణ ప్రారంభిస్తే రైతులు ఎప్పటికప్పుడు అమ్ముకుంటరు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. సౌకర్యాలతోపాటు, లారీలు, గోనె సంచుల కొరత లేకుండా చూడాలి.  


సన్నాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి- బానోత్‌ ప్రభాకర్‌, లింగపూర్‌, దండెపల్లి 

గతంలో దొడ్డు వడ్లను పండించేవాడిని.  ప్రభు త్వం చెప్పడంతో  13 ఎకరాల్లో సన్న రకాలను సాగు చేశాను. ప్రతికూల వాతావరణం, చీడపీడలు, తెగుళ్ల బెడదతో ఈ ఏడు సన్నాలు ఎకరానికి 18 బస్తాలు మాత్రమే పండాయి. పెట్టుబడి దక్కే పరిస్థితి లేదు. పొలం కోసి వారం రోజులవుతున్నది. ప్రభుత్వం కొను గోలు చేయడం లేదు.


త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం-వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ, అధికారి 

జిల్లాలో ధాన్యం సేకరణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. 250 సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం.  ట్రాన్స్‌పోర్టింగ్‌కు లారీలు, గన్ని సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏ గ్రేడ్‌కు క్వింటాలు కు రూ.1,888లు సాధారణ రకాలకు క్వింటాలుకు రూ.1,868 చెల్లించి కొనుగోలు చేస్తాం. నియమ నిబం ధనలకు లోబడి తేమ శాతం, రంగు ఇతరాత్ర పరి శీలించి కొనుగోలు చేస్తాం. సన్నరకం ధాన్యం కొను గోళ్ల గూర్చి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సన్నాల కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్ణ యం ప్రకారం నడుచుకుంటాం. 

Updated Date - 2020-11-17T10:19:30+05:30 IST