ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2020-12-16T04:27:41+05:30 IST
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ రియాజ్‌అలీకి వినతిపత్రం అందజేశారు.
-బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు
రెబ్బెన, డిసెంబరు 15: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ రియాజ్‌అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా అమలు చేయాలన్నారు. నిరుద్యోగులకు రూ.2వేల భృతి చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు భరత్, కిశోర్, వెంకటేష్, సునీల్, రాజేష్, ప్రేంసాగర్, తదితరులు పాల్గొన్నారు.