బీమా చెల్లింపులో ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి

ABN , First Publish Date - 2020-12-16T05:00:16+05:30 IST

రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఫసల్‌ బీమా చెల్లించడంలో అన్యాయం చేస్తున్నాయని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత అన్నారు. మంగళ వారం మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించారు.

బీమా చెల్లింపులో ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సుజాత

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 15: రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఫసల్‌ బీమా చెల్లించడంలో అన్యాయం చేస్తున్నాయని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత అన్నారు. మంగళ వారం మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించారు. ఫసల్‌ బీమా కింద ప్రిమియం చెల్లించిన రైతులకు నేడు డబ్బులు రాక ఇబ్బం దులు పడుతున్నారని దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వాటాలను కంపెనీలకు చెల్లించక పోవడమే కారణమని ఆరోపించారు. ఫసల్‌ బీమా కింద రైతులు 2018-19, 2019-20 రెండు సంవత్సరాలకు గాను ప్రీమియం చెల్లించడం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికి ఎలాంటి  పరిహారం అందలేదని పేర్కొన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత కంపెనీలకు తమ వాటాలను చెల్లించకపోవడం ప్రధాన కారణమని ఆరోపించారు. రైతుల ప్రభుత్వమంటూ గొప్పలు చెప్తున్న ప్రభుత్వాలు, ఆ పార్టీల ప్రజా ప్రతినిధులు రైతులకు పరిహారం అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతులను, ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నా యని విమర్శించారు. అందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వారి వారి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. దీనికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రీమియం చెల్లించిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవ్‌రెడ్డి, యూత్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు చరణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:00:16+05:30 IST