ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-05T05:50:32+05:30 IST
ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ నరేందర్జాదవ్ అన్నారు. శుక్రవారం తాంసి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

డీఎంఅండ్‌హెచ్‌వో నరేందర్
తాంసి, డిసెంబరు 4: ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ నరేందర్జాదవ్ అన్నారు. శుక్రవారం తాంసి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య కేంద్రం పని తీరును పరిశీలించారు. అధికారుల పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను కల్పిం చామన్నారు. ప్రతీ మండల కేంద్రంలో ఉన్న ఆరోగ్య కేం ద్రాలలో అన్ని వసతులను కల్పించామన్నారు. ఏ వ్యాధి వచ్చిన ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను సంబంధిత సిబ్బంది వారికి కావాల్సిన మందులను పంపిణీ చేయాల న్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులుతగ్గినాయని, డిసెంబర్ నుంచి చలి తీవ్రత వల్ల పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇందులో తాంసి పీహెచ్సీ ఇన్చార్జీ మహేందర్, ల్యాబ్ టెక్నిషియన్ ఆరీఫ్, సుగుణ, లక్ష్మి, వసంత దితరులున్నారు.