‘డబ్బుల గోల్‌మాల్‌లో సంబంధం లేదు’

ABN , First Publish Date - 2020-11-26T05:45:53+05:30 IST

మాక్స్‌ డబ్బుల గోల్‌మాల్‌ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాపైన అనవసరంగా ఆరోపణ చేస్తున్నారని ఈ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన వడ్ల లింబన్న అన్నారు.

‘డబ్బుల గోల్‌మాల్‌లో సంబంధం లేదు’

లక్ష్మణచాంద, నవంబరు 25: మాక్స్‌ డబ్బుల గోల్‌మాల్‌ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాపైన అనవసరంగా ఆరోపణ చేస్తున్నారని ఈ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన వడ్ల లింబన్న అన్నారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన లక్ష్మణచాంద మాక్స్‌లో డబ్బుల గోల్‌మాల్‌ కథనంపై ఆయన స్పందించారు. తాను ఈ మాక్స్‌ సేల్స్‌మన్‌గా మాత్రమే పని చేస్తున్నానని అన్నారు. సరుకు అమ్మగా వచ్చిన డబ్బులను మేనేజర్‌తో పాటు సిబ్బందికి ఎప్పటి డబ్బులు అప్పుడే ఇచ్చేవాడినని వాపోయాడు. అలాగే, తనపై  వచ్చిన ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

అలాగే, మాక్స్‌ డబ్బుల గోల్‌మాల్‌ వ్యవహరంలో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ చర్య తీసుకున్నా నేను భరిస్తానని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాక్స్‌ సిబ్బంది శ్రీనివాస్‌ అన్నారు. అసలు నగదు లావాదేవీలతో నాకు సంబం ధం లేదన్నారు. ఏ పని చేసినా మాక్స్‌ అధ్యక్షుల అనుమతితోనే చేశామన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వటం, అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయటం వంటి విధులు మాత్రమే నిర్వహించామని తెలిపారు. 

Updated Date - 2020-11-26T05:45:53+05:30 IST