అంబులెన్స్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది

ABN , First Publish Date - 2020-09-25T05:47:23+05:30 IST

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్‌ఏస్మైల్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి అంబులెన్సును బహుమతిగా

అంబులెన్స్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు


మంచిర్యాల, సెప్టెంబరు 24: మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్‌ఏస్మైల్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి అంబులెన్సును బహుమతిగా ఇవ్వడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తెలిపారు. అంబులెన్స్‌ వాహనాలను మంత్రి కేటీఆర్‌ గురువారం హైద్రాబాద్‌లో ప్రారం భించగా ఎమ్మెల్యే తన తనయుడు నడిపెల్లి విజిత్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్టు తరుపున అంబులెన్స్‌ కొనుగోలుకు విజిత్‌కుమార్‌ రూ. 20.50 లక్షల చెక్కును గత నెల 26న కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులె న్స్‌ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అందులో ఆక్సీజన్‌, వెంటిలే టర్‌ సదుపాయం ఉందని తెలిపారు. అంబులెన్స్‌ను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఇవ్వనుండగా, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. కేటీఆర్‌తోపాటు మరో మంత్రి ఐకే రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పాల్గొన్నారు. 


చెన్నూరు : మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసి గిఫ్ట్‌ఏస్మైల్‌ లో భాగంగా ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అందించిన రెండు అంబులెన్స్‌లను గురువారం ప్రగతిభవనంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. మందమర్రి, క్యాతనపల్లికి ఒకటి, చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్‌ మండలాల ప్రజలకు మరొకటి అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-25T05:47:23+05:30 IST