విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి

ABN , First Publish Date - 2020-03-16T12:11:51+05:30 IST

నిర్మల్‌ పట్టణంలో మదినా కాలనీకి చెందిన బుష్రా తబస్సుం (18) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి...

విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి

నిర్మల్‌టౌన్‌, మార్చి15: నిర్మల్‌ పట్టణంలో మదినా కాలనీకి చెందిన బుష్రా తబస్సుం (18) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తె లిపారు. తబస్సుం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోందని, తండ్రి అబ్దుల్‌ రబ్‌ ఎలక్ర్టిషన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహా న్ని ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ స భ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-03-16T12:11:51+05:30 IST