మహిళా మేయర్.. అంతా తయార్..
ABN , First Publish Date - 2020-12-01T07:21:02+05:30 IST
అటు కుటుంబం..

అటు కుటుంబం.. ఇటు ఆఫీస్, అటు కరోనా... ఇటు విధి నిర్వహణ. ఇన్నిటి మధ్య.. బ్యాలెన్స్ తప్పకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మహిళలు. ఎన్నికల విధులకు తరలివచ్చిన సిబ్బందిలో ప్రతి చోటా మహిళా ఉద్యోగుల ప్రధాన భాగస్వామ్యం స్పష్టంగా కనిపించింది. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా... అడుగడుగునా అతివలు అష్టకష్టాల కోర్చి ఎలెక్షన్ డ్యూటీలకు తరలి వస్తున్న దృశ్యాలను ఫొటోలలో చూడొచ్చు. చంటిపిల్లలను చూసేవారెవరూ కుటుంబంలో లేక.. వారితోనే డ్యూటీలకు వచ్చిన స్ర్తీలను చూస్తే.. వారి ఓర్పు, బాధ్యతల పట్ల అంకితభావానికి గౌరవంతో వందనం చేయని వారెవరూ ఉండరేమో! చట్ట ప్రకారం ఈసారి హైదరాబాద్ మేయర్ స్థానం మహిళది. 2020 నుంచి 2025 దాకా అయిదేళ్లు ఆమె సిటీకి నాయకత్వం వహిస్తారు. ఓ మహిళను మేయర్ చేయబోతున్న ఈ ఎన్నికల విధుల్లో.. అన్ని అంచెలలో అతివల క్రియాశీల పాత్రను ఫొటోలు ప్రతిబింబిస్తున్నాయి.