‘గల్ఫ్‌ కార్మికులకు ఫ్రీ క్వారంటైన్‌ ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2020-05-24T11:09:50+05:30 IST

గల్ఫ్‌ నుంచి వచ్చే కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాల్లో ఫ్రీ క్వారంటైన్‌ ఏర్పాటు చేయాలని గల్ఫ్‌ అవగాహన వేదిక వ్యవస్థాపక

‘గల్ఫ్‌ కార్మికులకు ఫ్రీ క్వారంటైన్‌ ఏర్పాటు చేయాలి’

ఖానాపూర్‌, మే 23: గల్ఫ్‌ నుంచి వచ్చే కార్మికులకు  తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాల్లో  ఫ్రీ క్వారంటైన్‌ ఏర్పాటు చేయాలని గల్ఫ్‌ అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు దొనికెని కృష్ట డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో చిక్కుకున్న 60 మంది తెలంగాణ ప్రాంత వాసులకు ఉచితంగా టికెట్స్‌ ఇప్పించి శుక్రవారం హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడించారు.


ఈ కష్టకాలంలో గల్ప్‌ కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చేందుకు తమ గల్ఫ్‌ అవగాహన వేదిక బృందం శ్రీనివాస్‌, మల్లేష్‌ గౌడ్‌, సారంగుల నారాయణ, నరేందర్‌, అడ్వాల సత్యం, దొనకంటి శ్రీకాంత్‌, సంతోష్‌, చంధ్రప్రకాష్‌, రమేష్‌, నవీన్‌, కిట్టు, నవీన్‌, నిరంజన్‌గౌడ్‌, సాగర్‌గౌడ్‌, సుమన్‌, రాజూయాదవ్‌, ఫసియోద్దిన్‌, షబ్బీర్‌ పాషా, కట్కం రవి, శ్రీనివాస్‌ తదితరులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్‌ నుంచి వచ్చే కార్మికులకు అండగా నిలువాలని వారు ఈ సందర్భంగా కోరారు. 

Updated Date - 2020-05-24T11:09:50+05:30 IST