దేగామ చెరువులో రొయ్యపిల్లల విడుదల

ABN , First Publish Date - 2020-12-11T05:43:46+05:30 IST

దేగామ చెరువులో గురువారం మత్స్యశాఖ ఆద్వర్యంలో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు 2.10లక్షల రొయ్యపిల్లలను వదిలారు.

దేగామ చెరువులో రొయ్యపిల్లల విడుదల
రొయ్యపిల్లలను విడిచిపెడుతున్న ఎమ్మెల్యే

బజార్‌హత్నూర్‌ డిసెంబరు10 : దేగామ చెరువులో గురువారం మత్స్యశాఖ ఆద్వర్యంలో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు 2.10లక్షల రొయ్యపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం వందశాతం సబ్సిడీతో రొయ్యపిల్లలను అందజేస్తుందన్నారు. కార్యక్ర మంలో మత్స్యశాఖ అదనపు డైరెక్టర్‌ రాథోడ్‌ శంకర్‌, బాపురావు, రమేష్‌, సుద ర్శన్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కానిందె రాజారాం పాల్గొన్నారు.

ప్రొటోకాల్‌ను పాటించడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం

ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు ప్రొటోకాల్‌ను పాటించడం లేదని ఎంపీపీ అజి డె జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలకేంద్రంలో ఆమె విలే కరుల సమావేశంలో మాట్లాడారు. దేగామలోని చెరువులో రొయ్యపిల్లలను వ దిలివేసేందుకు మత్స్యశాఖ అధికారులు ఆహ్వానించారని, తీరా తాము అక్కడి కి చేరుకోక ముందే కార్యక్రమాన్ని ముగించారని అన్నారు. ఈ విషయం పై క లెక్టరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేవల్‌సిం గ్‌, సుధాకర్‌, లింగన్న, పోతన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:43:46+05:30 IST