కుమరం భీం జిల్లాలో పత్తి కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2020-12-29T04:26:57+05:30 IST
మండలంలోని కాగజ్‌నగర్ క్రాస్ రోడ్డు వద్ద జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని రైతులు రాస్తారోకో నిర్వహిం చారు.

రెబ్బెన, డిసెంబరు 28: మండలంలోని కాగజ్‌నగర్ క్రాస్ రోడ్డు వద్ద జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని రైతులు రాస్తారోకో నిర్వహిం చారు. మండలంలోని రెబ్బెన, గోలేటి, నంబాల, నార్లపూర్, కిష్టాపూర్, తుంగెడ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పత్తిని విక్రయించడానికి కాగజ్‌నగర్ క్రాస్ రోడ్‌లోని జిన్నింగ్ మిల్లుకు చేరుకున్నారు. వివిధ వాహనాల్లో సుమారు వేయి క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. అయితే సంబంధిత యజమాన్యం ప్రతి రోజు 750 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామనడంతో రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆత్మారాంనాయక్, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గొలెం తిరుపతి మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై దీకొండ రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని జిన్నింగ్ మిల్లు యజమాన్యంతో పాటు అధికారులతో మాట్లాడారు. ఈ రోజు వచ్చిన పత్తి మొత్తం కొనుగోలు చేస్తా మని హామీ ఇచ్చారని ఎస్సై తెలియజేయడంతో రైతులు ఆందోళన విరమించారు.