‘పశుపోషణలో రైతులు జాగ్రత్తలు పాటించాలి’
ABN , First Publish Date - 2020-12-15T05:58:44+05:30 IST
పశుపోషణలో రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల పశువైద్యాధికారి డా.విశ్వజీత్ అన్నారు. సోమవారం మండలంలోని డొడర్న కిషన్‌నాయక్ తండాలో పశువులకు, మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు.

కుభీర్, డిసెంబరు 14: పశుపోషణలో రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల పశువైద్యాధికారి డా.విశ్వజీత్ అన్నారు. సోమవారం మండలంలోని డొడర్న కిషన్‌నాయక్ తండాలో పశువులకు, మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. అనంతరం పశుపోషణలో పెంపకందారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మొత్తం 300 పశువులకు మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత్‌గణపత్, జాదవ్ అయజ్, సిబ్బంది అవినాష్, రైతులు, తదితరులున్నారు.
కుంటాల: రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకుల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులను పోషకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ మధు అన్నారు. సోమవారం మండలంలోని అందకూర్ గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందు పంపిణీని ఆయన ప్రారంభించారు.
లోకేశ్వరం: మండలంలోని హవర్గా గ్రామంలో పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా కడుపులో నట్టల కాకుండా నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతు ప్రభుత్వం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్ భుజంగ్‌రావు, మండల పశు వైద్యురాలు జెస్సీ, నాయకులు బి.భోజన్న, గ్రామస్థులు, తదితరులున్నారు.
భైంసా రూరల్: మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో సోమవారం ఎంపీపీ జాదవ్ కల్పన పశువులకు నట్టల నివారణ మందులను వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వానకాలం పశువులకు రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయ ని, పశుపోషకులు తగు జాత్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, మండలంలోని ఇలేగాం, బాబుల్‌గాం, వానల్‌పాడ్ గ్రామాల్లో పశువైద్యాధికారి విఠల్ ఆధ్వర్యంలో మొత్తం 734 పశువుల మందులను పంపిణీ చేశారు. ఇందులో వానల్‌పాడ్, ఇలేగాం, బాబుల్‌గాం సర్పంచ్‌లు ఎం.పెద్ద రాజన్న, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
నార్నూర్: పశువులకు నట్టల నివారణ మాత్రలు వేయించాలని పశువైద్య సహాయకలు అబ్దుల్‌అల్తాప్ అన్నారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో ఆవులు, గేదేలకు నట్టల నివారణ మాత్రలు వేశారు. మొత్తం 840 ఆవులు, గేదెల కు నివారణ మాత్రలు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రామేశ్వర్, పశువైద్య సిబ్బంది ప్రభాకర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
బజార్‌హత్నూర్: మండలంలోని రైతులందరు పశుసంపదను పెంపొందిం చుకోవాలని జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రం పరిధిలోని పశువులకు నట్టల నివారణ మందులను తాపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి పర్వేజ్‌అహ్మద్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ: పశు పోషకులు తమ పశువులకు నట్టల నివారణ గోళీలను వేయించుకోవాలని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. సోమవారం మండలంలోని తేజాపూర్, చించోలి, లఖంపూర్ గ్రామాలలో 1,276 పశువులకు ఈ మందులను పశువెద్యాధికారి సుశీల్‌కుమార్ పంపిణీ చేశారు. ఇందులో సర్పంచ్‌లు పెంట వెంకటరమణ, ప్రపుల్‌చందర్‌రెడ్డి, జంగు, వైద్య సిబ్బంది, తదితరులున్నారు.