అటవీశాఖ అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-11-26T05:14:08+05:30 IST

రాష్ట్ర అటవీ శాఖ కంపా విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు లోకేశ్‌జైస్వాల్‌ ఐఎస్‌ఎఫ్‌ బుధవారం జిల్లాలో అటవీశాఖ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. నేరడిగొండ రేంజ్‌ పరిధిలో చేపట్టిన వణ్య ప్రాణుల కోసం గడ్డి భూముల పెంపకం, క్షీణించిన అడవుల పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు.

అటవీశాఖ అభివృద్ధి పనుల పరిశీలన
లోకేశ్‌ జైస్వాల్‌కు పూలమొక్కను అందజేస్తున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 25: రాష్ట్ర అటవీ శాఖ కంపా విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు లోకేశ్‌జైస్వాల్‌ ఐఎస్‌ఎఫ్‌ బుధవారం జిల్లాలో అటవీశాఖ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. నేరడిగొండ రేంజ్‌ పరిధిలో చేపట్టిన వణ్య ప్రాణుల కోసం గడ్డి భూముల పెంపకం, క్షీణించిన అడవుల పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఆదిలాబాద్‌ రేంజ్‌ పరిధిలో చేపట్టిన మావల పార్కు అభివృద్ధి, దుర్గానగర్‌ ప్రాంతంలో చేపట్టిన ఐటెక్‌ సెంటర్‌ల పునరుద్ధరణ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అడిషనల్‌ ఎస్పీతో అటవీ సంరక్షణ, పునరుద్ధరణ గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించారు. కంపా నిధులలో బేల మండల కేంద్రంలో నిర్మించిన రేంజ్‌ అధికారి భవనాన్ని ప్రారంభించారు. ఇందులో కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు, ఫీల్డ్‌ డైరెక్టర్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు సీపీ వినోద్‌కుమార్‌, జిల్లా అటవీ అధికారి ప్రభాకర్‌, ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ, అటవీ డివిజన్‌ అధికారులు చంద్రశేఖర్‌రావు, రాహుల్‌ జాదవ్‌, ఎం, బర్నోబా, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ అధికారి నవీన్‌రెడ్డి, బేల రేంజ్‌ అధికారి, ఇతర అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. 

Read more