ఆసిఫాబాద్‌ జిల్లాలో పులిని పట్టుకునేందుకు చర్యలు

ABN , First Publish Date - 2020-12-28T03:42:49+05:30 IST

పెద్దపులిని పట్టుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ సంరక్షణ అధికారి శాంతారాం అన్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో పులిని పట్టుకునేందుకు చర్యలు
అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

బెజ్జూరు, డిసెంబరు 27: పెద్దపులిని పట్టుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ సంరక్షణ అధికారి శాంతారాం అన్నారు. ఆదివారం బెజ్జూరు రేంజ్‌పరిధిలోని తలాయి మత్తడి అటవీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులి సంచారంపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలన్నారు. పెద్దపులి సంచరించే ప్రాంతంలో రైతులు గుంపులుగా చప్పుళ్లు చేస్తూ పనులకు వెళ్లాలని తెలిపారు. ఆయన వెంట రేంజ్‌ అధికారులు దయాకర్‌ వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.


బేస్‌క్యాంపు పరిశీలన
పెంచికలపేట: పెంచికలపేట రేంజ్‌ పరిధిలోని గుండెపెల్లి బీట్‌లో నిర్మిస్తున్న ఫారెస్ట్‌ బేస్‌ క్యాంపును ఆదివారం జిల్లా అటవీ అధికారి శాంతారాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. అనుమానితులు ఎవరైనా అటవీ ప్రాంతంలో సంచరిస్తే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలన్నారు. అటవీ సంపదను కాపాడి భావి తరాలకు అందివ్వాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎఫ్‌ఆర్‌వో వేణు గోపాల్‌, డిప్యూటీ ఆర్‌వో ప్రభాకర్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-12-28T03:42:49+05:30 IST