సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2020-11-20T04:36:59+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

-కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 19: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై   ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం ఆసిఫాబాద్‌లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ప్రత్యేకా ధికారులు, ఏఈఓలు, ఏఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డ్రాయింగ్‌ ప్లాట్‌ ఫాం, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్‌ నిర్మాణాలపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీవోలు పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించి టార్గెన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వారంలోగా గ్రౌడింగ్‌ చేసి రెండు వారాల్లో పూర్తి చేయాలని ప్రతి రోజు ఫొటో తీసి పంపించాలని, పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. సెగ్రిగేషన్‌ షెడ్‌, వైకుంఠ దామాల నిర్మాణ పనులు నాలుగు వారాలలో పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో డిసెంబరు1 నుంచి ప్లాస్టిక్‌ నిషేధించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ప్లాస్టిక్‌ను వాడితే జనవరి నుంచి జరిమానాలు విధిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్‌ఓ సురేష్‌, సీపీఓ సాయగౌడ్‌, డీపీఓ రమేష్‌, డీఆర్‌డీఏ వెంకట శైలేష్‌, వ్యవసాయ శాఖాధికారి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T04:36:59+05:30 IST