ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్‌కు ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2020-10-27T10:39:56+05:30 IST
ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ (ఎంపీటీఎల్‌ఏ)కు మాజీ ఎమ్మెల్సీ, కాం గ్రెస్ సీనియర్ నాయకులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సోమవారం రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఏసీసీ, అక్టోబరు 26 : ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ (ఎంపీటీఎల్‌ఏ)కు మాజీ ఎమ్మెల్సీ, కాం గ్రెస్ సీనియర్ నాయకులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సోమవారం రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎంపీటీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు నారమల్ల విజయ్‌కుమార్, కమిటీ సభ్యులు సోమవారం ప్రేమ్‌సాగర్‌రావును కలిసి వేతన సమస్యను ఆయనకు వివరించారు. విద్యాసంస్థలు మూతపడటంతో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి యాజమాన్యాలు వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, విద్యాసంస్థల యాజమాన్యా లు ఆర్థిక ఇబ్బందులతో అద్దె కూడా చెల్లించలేని పరి స్థితుల్లో ఉన్నాయని వివరించారు. ఆయన స్పందించి రూ.20 వేలు ఆర్థికసాయం అందజేశారు. రాష్ట్ర కార్యని ర్వాహక అధ్యక్షురాలు మద్ది పద్మ, జనరల్ సెక్రెటరీ మంగారావు, కోఆర్డినేటర్ శైలజ, కిషోర్ పాల్గొన్నారు.