పాముకాటుతో మహిళా రైతు మృతి
ABN , First Publish Date - 2020-12-30T05:29:41+05:30 IST
మండలంలోని కుచ్లాపూర్ గ్రామానికి చెందిన నోముల వీణ(30) అనే మహిళా రైతు పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
తలమడుగు, డిసెంబరు 29: మండలంలోని కుచ్లాపూర్ గ్రామానికి చెందిన నోముల వీణ(30) అనే మహిళా రైతు పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం తమ పొలంలో పనులు చేస్తుండగా మధ్యాహ్న సమయంలో పాముకాటు వేయడంతో కుటుంబీకులు గమనించి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.