రైతుల మేలు కోసమే రైతు వేదిక భవనాలు

ABN , First Publish Date - 2020-07-05T10:46:52+05:30 IST

రైతులకు మేలు చేసేందుకే గ్రామాల్లో రైతు వేదిక భవనా లను ప్రభుత్వం నిర్మిస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు

రైతుల మేలు కోసమే రైతు వేదిక భవనాలు

దండేపల్లి, జూలై 4: రైతులకు మేలు చేసేందుకే గ్రామాల్లో రైతు వేదిక భవనా లను ప్రభుత్వం నిర్మిస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంతోపాటు మాదాపూర్‌లో రైతువేదిక నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను ఆర్ధికం గా బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు వేదికలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. దండేపల్లిలో పల్లె ప్రకృతి వనం స్థలంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు. ఎంపీపీ శ్రీనివాస్‌,  గురువయ్య, లింగన్న, అనిల్‌,  శ్రీనివాస్‌, వెంకటేష్‌, తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌,  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

 

కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు యత్నిస్తు న్నారనే సమాచారంతో ముందస్తుగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.   జిల్లా నాయకుడు గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వనపర్తి రవి, ఎంపీటీసీ శ్రీనివాస్‌, సర్పంచు ఎల్తెపు శ్రీనివాస్‌, ఉదయ్‌కిరణ్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ వెల్లడించారు.  ప్రజాప్రతినిధులకు  సమాచారం లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారని నాయకులు ఆరోపించారు.

Updated Date - 2020-07-05T10:46:52+05:30 IST