గురు దక్షిణ కథసౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్‌ శ్రీదేవసేన

ABN , First Publish Date - 2020-02-08T11:46:11+05:30 IST

ఆదిలాబాద్‌ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవసేన మొదటి సారి శుక్ర వారం కలెక్టర్‌ కార్యాలయానికి

గురు దక్షిణ కథసౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్‌ శ్రీదేవసేన

ఆదిలాబాద్‌టౌన్‌, పిబ్రవరి7: ఆదిలాబాద్‌ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవసేన మొదటి సారి శుక్ర వారం కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. వెంటనే కలెక్టర్‌ చాంబర్‌తో పాటు జేసీ, డీఆర్‌వో, ఆర్డీవో, ఏవో చాంబర్‌లను పరిశీ లించడంతో పాటు ఆయా సెక్షన్లను సందర్శించారు. కలెక్టరేట్‌ ప్రాంగణం బా గుందని అయితే సరి చేయాల్సిన సమస్య లు, అసౌకర్యాలు కళ్లకు కట్టినట్లు కనిపి స్తున్నాయని అన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారు లకు సూచించారు. కార్యాలయ మరమ్మ తు పనులను పరిశీలించిన ఆమె పనుల జాప్యంపై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని అడ్మిని స్ర్టేటివ్‌ అధికారిని ఆదేశించారు. కార్యాల యంలో చేర్పులు, మార్పులపై పలు సూచనలు జారీ చేశారు. అంతకు ముం దు మొదటి సారి కలెక్టరేట్‌ కార్యాలయా నికి చేరుకున్న కలెక్టర్‌ శ్రీదేవసేనకు వివి ధ శాఖల జిల్లా అధికారులు పరిచయం చేసుకొని పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాం క్షలు తెలిపారు. మరికొంత మంది అధికా రులు, ఉద్యోగులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛా లతో పాటు ముందుగా సూచించినట్లుగా విద్యార్థులకు ఉపయోగపడే వస్తు వులను కలెక్టర్‌కు అందజేశారు.

Updated Date - 2020-02-08T11:46:11+05:30 IST