పల్లెప్రగతి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-03T05:33:31+05:30 IST

మండల కేంద్రంలోని పల్లె ప్రగతి పనులను బుధ వారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌రాజ్‌ పరిశీలించి పనుల గురించి అడిగి తెలుసుకు న్నారు. గ్రామంలో చేపడుతున్న డంపింగ్‌యార్డ్‌, నర్సరీ, శ్మశాన వాటికలను సందర్శించిన ఆయన పనులను త్వరితగతిన పూర్తిచేసి గ్రామీణాభివృద్ధికి పాటు పడాలని అధికారులను ఆదేశించారు.

పల్లెప్రగతి పనుల పరిశీలన
డంపింగ్‌యార్డును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

సిరికొండ, డిసెంబరు 2: మండల కేంద్రంలోని పల్లె ప్రగతి పనులను బుధ వారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌రాజ్‌ పరిశీలించి పనుల గురించి అడిగి తెలుసుకు న్నారు. గ్రామంలో చేపడుతున్న డంపింగ్‌యార్డ్‌, నర్సరీ, శ్మశాన వాటికలను సందర్శించిన ఆయన పనులను త్వరితగతిన పూర్తిచేసి గ్రామీణాభివృద్ధికి పాటు పడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పీడీ రాజేశ్వర్‌, ఎంపీడీవో సురేష్‌, కార్యదర్శి పురుషోత్తం, ఉప సర్పంచ్‌ తోకల చిన్నరాజన్న ఉన్నారు. అలాగే మండలంలోని పోచంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను అదనపు కలెక్టర్‌ డేవిడ్‌రాజ్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో భవనం నిర్మాణం పూర్తి చేయాలని అధికారు లను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 

Updated Date - 2020-12-03T05:33:31+05:30 IST