రంజాన్ పండుగకు అందరూ సహకరించాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2020-05-24T11:08:20+05:30 IST
రంజాన్ పండుగ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలను పా టిస్తూ ప్రతిఒక్కరూ సహకరించాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. శనివారం జిల్లా

సోన్, మే 23: రంజాన్ పండుగ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలను పా టిస్తూ ప్రతిఒక్కరూ సహకరించాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోకి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్‌ను పురస్కరించుకొని జీవో 68 అమలు లో ఉన్నందున ఎక్కడా కూడా ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేదన్నారు. పండుగను పురస్కరించుకొని ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ భౌతికదూరం తప్పసరి అన్నారు. లాక్ డౌన్ అమలులో పోలీసులు తమ బాధ్యతలను సమర్థవంతంగా పాటించడం పట్ల ఎస్పీ వారిని అభినందించారు. కరోనా వైరస్ నుంచి కొంత మేరకు తట్టుకోవడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు సైతం పోలీసులకు అందజేయడం జరుగుతోందన్నారు. సమావేశంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ టౌన్ సోన్ సీఐ జాన్ దివాకర్, జీవన్ రెడ్డిలతో పాటు పోలీసులు ఉన్నారు.
ఎండను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు పం పిణీ చేశారు. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు విటమిన్(సి) లభించే ఆహర పదార్థాలు, పండ్లు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో వసంత్ రావు, డాక్టర్ దేవేంధర్ రెడ్డి, కార్తీక్, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు జాన్‌దివాకర్, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఎస్పీ పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ కరోనా కట్టడితో పాటు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.