ఇసుక కొరతతో ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-12-08T03:57:08+05:30 IST

జిల్లా వ్యా ప్తంగా ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ పరంగా రీచ్‌లు ఏర్పాటు చేయడంలో అధికారులు జా ప్యం చేస్తుండటంతో ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుంటు పడుతుండగా, దానిపై ఆధారపడ్డ వేలాది మంది కూలీలు ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నా రు.

ఇసుక కొరతతో ఇబ్బందులు
జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన భవన నిర్మాణం

ప్రభుత్వ రీచ్‌లు ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం

కుంటుపడుతున్న భవన నిర్మాణ రంగం

దూర ప్రాంతాల నుంచి లారీలతో తరలింపు

అధిక వ్యయ, ప్రయాసలకు గురవుతున్న బిల్డర్లు

ఉపాధికి దూరమవుతున్న దినసరి కూలీలు


మంచిర్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యా ప్తంగా ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ పరంగా రీచ్‌లు ఏర్పాటు చేయడంలో అధికారులు జా ప్యం చేస్తుండటంతో ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుంటు పడుతుండగా, దానిపై ఆధారపడ్డ వేలాది మంది కూలీలు ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నా రు. జిల్లాలో ఈ సంవత్సరం మార్చి 16 స్యాండ్‌ టాక్సీ పాలసీని కలెక్టర్‌ భారతిహోళికేరి జెండా ఊపి ట్రాక్టర్లను ప్రారంభించారు. గృహ నిర్మాణ అవసరాల కోసం జిల్లాలో ని హాజీపూర్‌ మండలం ముల్కల్ల, వేంపల్లి, నస్పూర్‌ మండలం తాళ్లపల్లి, జైపూర్‌ మండలం రామారావుపేట గ్రామాల్లోని గోదావరి నదిలో ప్రభుత్వ పరంగా ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఇసుక అవసరమైన వారు వెబ్‌సైట్‌, మీసేవ కేంద్రాలలో వివరాలను నమోదు చేసు కుంటే తక్కువ ధరకు నేరుగా ఇంటి వద్దకే వచ్చేది. అయితే తదనంతరం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా భవన నిర్మాణాలు నిలిచిపోయి ఇసుక టాక్సీ పాలసీ పథకం అర్థాంతరంగా ఆగిపోయింది. 


రీచ్‌ల ఏర్పాటులో తీవ్ర జాప్యం 

వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదా వరిలో నిండుగా నీరు చేరడంతో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అంతరాయం ఏర్పడుతోంది. ఇసుక తవ్వకా లు జరిపేందుకు ఆస్కారం లేకపోవడంతో నదిలో ప్రభు త్వపరంగా రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. దీంతో ఇసుక కొరత తీవ్రమై భవన నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతోంది. గతంలో గోదావరి నిండుగా ప్రవహించినప్పుడల్లా ప్రత్యామ్నా యంగా యంత్రాంగం ఇతరత్రా ఏర్పాట్లపై దృష్టి కేంద్రీక రించేంది. ఇసుక అందుబాటులో ఉన్న వాగుల్లో తవ్వకా లు జరిపేందుకు అనుమతులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఇసుక కొరతతో  ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నెన్నెల మండలం ఖర్జీ, చెన్నూరు మండలం బతుకమ్మ వాగుల్లో మాత్రమే అధికారిక ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉన్నా యి. ఇసుక కొరత కారణంగా జిల్లా కేంద్రంలోని కాజ్వే వంతెన వద్ద రాళ్లవాగుతోపాటు స్థానికంగా పట్టా భూ ముల్లో కొందరు అక్రమ తవ్వకాలు జరుపుతూ గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండగా, వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. 


కుంటుపడుతున్న భవన నిర్మాణ రంగం...

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగం కుంటుపడుతోంది. కొవిడ్‌ ప్రభావంతో కూలీలు అందు బాటులో లేక దాదాపు ఆరు నెలలపాటు పనులు ముం దుకు సాగక ఇబ్బందులను ఎదుర్కొన్న నిర్మాణ రంగం, ప్రస్తుతం ఇసుక కొరతతో మళ్లీ కుదేలైంది. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలు, గృహాలు  నిలిచిపో యాయి. గత్యంతరంలేని పరిస్థితుల్లో కొందరు యజమా నులు ఇసుకను బ్లాక్‌లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోవలసి వస్తోంది. ఇసుక అందుబాటులో ఉన్న సమయంలో కొందరు వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేశారు. ప్రస్తుతం కొరత ఉన్నందున బ్లాక్‌ చేసిన ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పు ఇసుక రూ. 5వేల వరకు ధర పలుకుతుండటం గమనార్హం. 


వ్యయ, ప్రయాసలకు గురవుతున్న బిల్డర్లు....

ఇసుక అందుబాటులో లేకపోవడంతో అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్న బిల్డర్లు తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. తెలం గాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఎండీసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల కోసం జిల్లాలోని చెన్నూరు ప్రాంతంలోని గోదావరి నదిలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా క్వారీలు ఏర్పాటు చేసి, తవ్వకాలకు పర్మిట్లు ఇచ్చారు. జిల్లాలోని బిల్డర్లు ప్రస్తుతం అక్కడి ఇసుక రీచ్‌లపై ఆధారపడి లారీల ద్వారా తరలిస్తున్నారు. దూరభారం పెరగడంతో అధిక వ్యవ ప్రయాసలకు ఓర్చుకోవలసి వస్తుందని చెబుతు న్నారు. ఒక్కో లారీ ఇసుక ట్రిప్పును రూ. 50 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్థానికంగా ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


కూలీల ఉపాధికి ఆటంకం...

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగం కుంటుపడి దానిపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధికి ఆటంకం ఏర్పడనుంది. తాపీ మేస్త్రీలు, కూలీలతోపాటు కార్పెంటర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, వెల్డర్లు, ఇటుకల తయారీదారులు, ట్రాక్టర్లపై పనిచేసే డ్రైవర్లు, ఓనర్లు, కూలీలు ఆధారపడతారు. జిల్లా వ్యాప్తంగా 50వేలకు పైబడి భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డట్లు తెలుస్తోం ది. ప్రస్తుతం వీరిలో అనేక మందికి ఉపాధి లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల కార్మికులకు ఇప్పుడిప్పుడే మెరుగైన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. ప్రస్తుతం ఇసుక కొరత కారణంగా మళ్లీ పాతరోజులే పునరావృతం అయ్యే పరిస్థితులు  నెలకొన్నాయి. 


ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలి

పడాల రామన్న, భవన నిర్మాణ రంగ అధ్యక్షులు

గోదావరి నదితోపాటు అందుబాటులో ఉన్న వాగులు, వంకల్లో ప్రభుత్వ పరంగా ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలి. అత్యవసరంగా రీచ్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే చెన్నూరులోని బతుకమ్మ వాగు నుంచైనా అను మతులు ఇవ్వాలి. ఇసుక కొరత వల్ల వందలాది నిర్మా ణాలు ఆగిపోయాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. పెట్టుబడులు పెట్టి బిల్డర్లుగా మారిన వారు  ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పం దించి ఇసుక రీచ్‌లు త్వరగా ఏర్పాటు చేయాలి. 


రోడ్ల ఇబ్బందితోనే ఆలస్యం 

రమావత్‌ బాలు, జిల్లా మైనింగ్‌ ఏడీ 

చిన్న వాగుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో లేవు. గోదావరిలో నీళ్లు నిండుగా ఉన్నందున అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. జైపూర్‌ మండలంలోని రసూల్‌పల్లి వాగులో అధికారికంగా ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరిపాం. అందులో ఇసుక అందుబాటులో ఉంది. అయితే వాగులోకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యంలేక ఆలస్యం జరుగుతోంది. త్వరలోనే ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. 


Updated Date - 2020-12-08T03:57:08+05:30 IST