నేటి నుంచి బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-03-15T12:52:23+05:30 IST

ఆదిలాబాద్‌ ఉమ్మడి జి ల్లాలోని బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిం చనున్నారు. 6,7,8

నేటి నుంచి  బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష

హాజరుకానున్న 5854 మంది విద్యార్థులు


ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి 14: ఆదిలాబాద్‌ ఉమ్మడి జి ల్లాలోని బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిం చనున్నారు. 6,7,8 తరగతులలో ఉన్న ఖాళీలకు గాను ఈ పరీక్షలు జరుగనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ గోపిచంద్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23 సెంటర్లకు 329 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నా రు.


ఇందులో 6,7,8 తరగతులకు మొత్తం 5854 దరఖాస్తు లు వచ్చాయని తెలిపారు. 6వ తరగతికి 3015, 7వ తర గతికి 1488, 8వ తరగతికి 1351 చొప్పున విద్యార్థులు దర ఖాస్తులు చేసుకున్నారన్నారు. ఆదివారం ఈ పరీక్ష ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ని ర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు విద్యార్థులు హాల్‌ టికెట్‌తో సకాలంలో హాజరు కావాలని ఆర్సీఓ కోరారు. 

Updated Date - 2020-03-15T12:52:23+05:30 IST