ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: ఆదిలాబాద్‌ ఎస్పీ

ABN , First Publish Date - 2020-03-16T12:17:11+05:30 IST

రోడ్డు ప్రమా దాల నియంత్రణ అత్యవసరం కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు ప్రారంభిం చిందని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ వెల్లడించారు...

ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: ఆదిలాబాద్‌ ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి15: రోడ్డు ప్రమా దాల నియంత్రణ అత్యవసరం కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు ప్రారంభిం చిందని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన ఆదివారం పోలీసు ముఖ్యకార్యాలయం నుంచి రోడ్డు భద్రత చర్యలపై తీసుకుంటున్న వి వరాలను  వెల్లడించారు. ఈ యేడాది రోడ్డు భద్ర త సంవత్సరంగా రాష్ట్ర పోలీసు డీజీపీ ఎం.మ హేందర్‌ రెడ్డి ప్రకటిచండంతో జిల్లా పోలీసులు రో డ్డు ప్రమాదాలు, మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రమాదాలతో జరగ కుండా పోలీసులు, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులతో పాటు ప్రజల సహకారంతో అన్నిజాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా లక్ష్యాలు నిర్దేశించుకోవ డం, ఇతర అనేక భద్రత చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. అందుకే 2020 ను రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటించి రోడ్డు ప్రమాదాల శాతాన్ని గణనీయంగా తగ్గించడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేపడున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల ప్రణాళిక విధి విధానాల రూ పకల్పనలో పలు ప్రభుత్వ విభాగాల సహకారం తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులకు ఈ స ందర్భంగా ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల పై సంబంధిత శాఖలతో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాల వర్గీకరణ, విశ్లేషణ, సమీక్ష వంటి కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా బా ట సారులు ప్రమాదాల భారీన పడకుండా ప్రత్యే క చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎలా జరిగాయో గుర్తించేందుకు త్వరలో ఒక ఇ న్‌స్పెక్టర్‌స్థాయి అధికారి పర్యవేక్షణలో రోడ్‌ ట్రాఫి క్‌ యాక్సిడెంట్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జాతీయ రహ దారిపై సీసీ టీఎన్‌ఎస్‌ అధికారుల బృందంతో వా హనదారులు నిర్ణీత వేగాన్ని దాటి హద్దు మీరితే స్పీడ్‌ లేజర్‌ గన్‌ పరిజ్ఞానంతో నిర్ధారించుకొని జరి మానాలు విధిస్తున్నారని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రతీరోజు ఆటో, జీపు, బైక్‌ రైడర్లు, ఆటో ట్రాలీ, వాహన యజమానులకు రో డ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్య పరుస్తున్నారని తెలిపారు. ప్రమాదాల ని వారణకు అందరూ సహకరించాలని కోరారు.

Updated Date - 2020-03-16T12:17:11+05:30 IST