ఎంఎస్పీ పటిష్టతకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:34:18+05:30 IST

మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) పటిష్టతకు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నారు.

ఎంఎస్పీ పటిష్టతకు కృషి చేయాలి
మాట్లాడుతున్న మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌

-ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు30: మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) పటిష్టతకు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నారు. బుధవారం పట్టణం లోని రాయిసెంటర్‌ భవన ఆవరణలో నిర్వహించిన మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీని నియమించారు. పార్టీ జిల్లా కన్వీనర్‌గా మొండయ్య, కో కన్వీనర్‌లుగా శంకర్‌, మెంగాజీ, లవ్‌కుమార్‌, రవికుమార్‌, వెంకటేష్‌, రవీందర్‌, అన్సారీ, జిల్లా కో ఆర్డినేటర్‌గా రేగుంట మహేష్‌ను నియమిం చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కేశవరావు, ఎంఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు రజీహైదర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:34:18+05:30 IST