ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలి

ABN , First Publish Date - 2020-12-31T04:35:37+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో మూతబడిన పాఠశాలలతో విద్యకు దూరమై ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్‌, యాదగిరి దూరదర్శన్‌, ఆన్‌లైన్‌ ద్వారా తరగతులను వింటున్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు.

ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 30: కరోనా వైరస్‌ ప్రభావంతో మూతబడిన పాఠశాలలతో విద్యకు దూరమై ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్‌, యాదగిరి దూరదర్శన్‌, ఆన్‌లైన్‌ ద్వారా తరగతులను వింటున్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యను బోధించాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని గజిటెడ్‌ నెంబర్‌ 1 స్కూల్‌ను సందర్శించి ఉపాధ్యాయుల రిజిస్ట్రర్లను, డైరీలను పరిశీలించారు. క్రమంతప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని ఉపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేశారు. అటు జిల్లా సెక్టోరల్‌ అధికారి కంటెనర్సయ్య పట్టణంలోని సరస్వతినగర్‌ పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులకు బోధిస్తున్న తరగతులపై ఆరా తీశారు.

Updated Date - 2020-12-31T04:35:37+05:30 IST