నాణ్యమైన విద్యను అందించాలి

ABN , First Publish Date - 2020-11-26T04:04:06+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని డీఐఈవో డాక్టర్‌ శ్రీధర్‌సుమన్‌ అన్నారు.

నాణ్యమైన విద్యను అందించాలి
కళాశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న డీఐఈవో శ్రీధర్‌సుమన్‌

-డీఐఈవో డాక్టర్‌ శ్రీధర్‌సుమన్‌

రెబ్బెన, నవంబరు25: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని డీఐఈవో డాక్టర్‌ శ్రీధర్‌సుమన్‌ అన్నారు. బుధవారం ఆయన రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. ఈసందర్భంగా ఎన్ని అడ్మిషన్లు అయ్యాయి, ఆన్‌లైన్‌ తరగతులు ఎలా జరుగుతున్నాయని ప్రిన్సి పాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష అడ్మిషన్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ దిశగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శంకర్‌, అధ్యాపకులు సతీష్‌, శ్రీనివాస్‌, రామారావు, ప్రకాష్‌, వెంకటేష్‌, ప్రవీణ్‌, సుశీల్‌, నిర్మల, దీప్తి, మంజుల, మల్లేశ్వరి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T04:04:06+05:30 IST