దుబ్బాక నిరంకుశ పాలనతోనే దుబ్బాకలో ఓటమి

ABN , First Publish Date - 2020-11-13T10:30:53+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై

దుబ్బాక నిరంకుశ పాలనతోనే దుబ్బాకలో ఓటమి

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌


ఏసీసీ, నవంబరు 12 : దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర థియేటర్‌ నుంచి బెల్లంపల్లి చౌరస్తా, హమాలివాడ, రైల్వేస్టేషన్‌, అశోక్‌ రోడ్డు, చున్నంబట్టి వాడ, శ్రీశ్రీనగర్‌, ఓవర్‌బ్రిడ్జి, ఐబీ చౌరస్తా, మున్సిపల్‌ కార్యాలయం మీదుగా అర్చనటెక్స్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా  రఘునాథ్‌ మాట్లాడుతూ దుబ్బాక విజయం ప్రజల విజయమని, కేసీఆర్‌ పతనం దుబ్బాక నుంచి మొదలైందన్నారు. రానున్న రోజుల్లో దుబ్బాక తరహా తీర్పు రాష్ట్రమంతటా ప్రజలు అందించి కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారన్నారు. కేసీఆర్‌ పలు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం వల్ల దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు.


ఇంటికో ఉద్యోగం,  నిరుద్యోగ భృతి పేరిట మోసగించడంతో యువత కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉందని, రైతులను సన్నరకం వరిపంట సాగు చేయమని చెప్పి పంట చేతికి వచ్చాక కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. దుబ్బాక ఫలితం 2023లో పునరావృతమై బీజేపీకి ప్రజలు పట్టం కడతారని జోస్యం చెప్పారు. బైక్‌ర్యాలీని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్య క్షుడు పట్టి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు వెం కటేశ్వర్‌రావు, అందుగుల శ్రీనివాస్‌, మునిమంద రమేష్‌,  జోగుల శ్రీదేవి, రాచకొండ సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-13T10:30:53+05:30 IST