దుబాయ్ వాసులపై ఆందోళన వద్దు
ABN , First Publish Date - 2020-03-23T10:30:45+05:30 IST
కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దుబాయ్‌లో ఉంటున్న తెలంగాణ వాసులంతా క్షేమంగానే ఉన్నారని

జనతా కర్ఫ్యూలో మేము కూడా పాల్గొన్నాము
గల్ఫ్ అవగాహన వేదిక నేత నవీన్
నిర్మల్ టౌన్, మార్చి 22 : కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దుబాయ్‌లో ఉంటున్న తెలంగాణ వాసులంతా క్షేమంగానే ఉన్నారని ముఖ్యంగా నిర్మల్ జిల్లా వాసులు సురక్షితంగా ఉన్నారని వారంతా ఎలాం టి ఇబ్బందులకు గురి కావడం లేదని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఎన్‌ఆర్‌ఐ సెల్ సెంట్రల్ కమిటీ మెంబర్ గోనె నవీన్ తెలిపారు. ఈ మేరకు జనతా కర్ఫ్యూను పురస్కరించుకొని ఆదివారం ఆయన దుబా య్ నుంచి మాట్లాడారు.
జనతా కర్ఫ్యూలో తాము కూడా పాల్గొన్నామని ఆయన వివరించారు. దుబాయ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉందని అయినప్పటికీ నిర్మల్ జిల్లా వాసులుల్లో ఏ ఒక్కరికి కూడా కరో నా వైరస్ పాజిటివ్ రాలేదని తెలిపారు. ఇక్కడ అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. దుబాయ్ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వ్యాప్తిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారం చేపట్టిందన్నారు. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
దేశాలు, ప్రాంతాల కతీతంగా కరోనాను తుదముట్టించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దుబాయ్‌లో ఉండే వలస కార్మికులందరికీ కరోనాపై అవగాహన కల్పించేందుకు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి కరోనాను అరికట్టేందుకు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపులో ప్రజలంతా స్వచ్ఛదంగా పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.