డాక్యుమెంట్‌ రైటర్ల ధర్నా

ABN , First Publish Date - 2020-12-16T03:59:06+05:30 IST

జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రా ర్‌ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మంగళవారం ధర్నాకు దిగారు.

డాక్యుమెంట్‌ రైటర్ల ధర్నా
మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లు

మంచిర్యాల, డిసెంబరు 15 (ఆంరఽధజ్యోతి): జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రా ర్‌ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మంగళవారం ధర్నాకు దిగారు. ధరణి పోర్టల్‌లో భాగంగా ప్రభుత్వం రూ పొందించిన డాక్యుమెంట్‌ ఎందుకు పనికి రాదన్నారు. భవిష్యత్‌లో ప్రజలు  ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా డాక్యుమెంట్‌ రైటర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎల్‌ఆర్‌తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ధరణి పోర్టల్‌తో ఒక్క రిజిస్ట్రేషన్‌ సక్రమంగా జరగడం లేదన్నారు. దశాబ్దాల కాలం క్రితం కొనుగోలు చేసిన స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాలనడం సమంజసంగా లేదన్నారు. ఇప్పటికైనా  పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతి రేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దీపక్‌ ఉపాధ్యాయ, కొట్టె మధుకర్‌, శ్రీనివాస్‌, నీలి శ్రీనివాస్‌, దుర్గం అశోక్‌, వూడెం వెంకటస్వామి, కర్ణ శ్రీధర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-16T03:59:06+05:30 IST