ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు : ఎస్పీ

ABN , First Publish Date - 2020-04-24T10:04:52+05:30 IST

వేసవిలో లాక్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ శశిధర్‌

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు : ఎస్పీ

నిర్మల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి), సోన్‌, నిర్మల్‌ కల్చరల్‌ : వేసవిలో లాక్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద సిబ్బందికి మా స్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, శానిటైజర్లు అందజేశారు. లా రీ డ్రైవర్లకు ఆహార పొట్లాలు అందించారు. నిర్మల్‌లోని క ట్టడి ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి బారికెడ్లు, పోలీస్‌ పికెట్‌ లు పరిశీలించారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి స హకరించాలని కోరారు.


ఆయన వెంట సీఐలు జాన్‌ దివాకర్‌, జీవన్‌ రెడ్డి, ఎంటీవో వినోద్‌, సిబ్బంది పాల్గొన్నారు. క రోనా వైరస్‌ నివారణ కోసం కృషి చేస్తున్న పోలీసు, ఉద్యో గులకు ప్రతినిత్యం అల్పాహారం అందించేందుకు నిర్మల్‌లోని తిరుమల నర్సింగ్‌ యాజమాన్యం రూ. 1.50 లక్షల చెక్కును ఎస్పీ శశిధర్‌ రాజు సమక్షంలో నిర్వాహకుడు నవయుగ మూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సీఐ జాన్‌ దివాకర్‌, శ్రీనివాస్‌ రెడ్డితో పా టు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ తిరుమల యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

Updated Date - 2020-04-24T10:04:52+05:30 IST