అసాంఘిక శక్తులకు సహకరించవద్దు
ABN , First Publish Date - 2020-09-18T06:00:47+05:30 IST
ఆసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించవద్దని రామగుండం కమిషనరేట్ అదనపు డీసీపీ అశోక్‌కుమార్ వెల్లడించారు

దండేపల్లి,సెప్టెంబరు 17 : ఆసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించవద్దని రామగుండం కమిషనరేట్ అదనపు డీసీపీ అశోక్‌కుమార్ వెల్లడించారు. కొత్త మామిడిపల్లి పంచాయతీ పరిధి అటవీ ప్రాంతం సమీపంలోని దమ్మనపేటలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజనులతో సమావేశమైన అదనపు డీసీపీ మా ట్లాడుతూ గిరిజనుల జీవన విధానంలో పోలీసులు ఎలాంటి జోక్యం చేసుకోమని, అలాగే గూడెంలోకి అపరిచిత వ్యక్తులు వచ్చి ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఆక ర్షితులు కావద్దన్నారు. ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కరోనా సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు భౌతిక దూరం, మాస్కులను ధరించాలన్నారు. సర్పంచు గడ్డం రాజయ్య, ఇన్చార్జి ఏసీపీ గోపతి నరేందర్, సీఐలు నారాయణనాయక్, కుమారస్వామి, ఉప సర్పంచు నలిమెల మహేష్, ఎస్సైలు, ఏఎస్సైలు పాల్గొన్నారు.