అసంతృప్తులకు గాలం
ABN , First Publish Date - 2020-12-18T05:14:01+05:30 IST
దుబ్బాక, గ్రేట ర్ వరుస ఎన్నికల తరువాత ప్రజల్లో కమలం పార్టీ ఇమేజ్ పెరిగిపోవడంతో అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కమలం ఫీవర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలు సందిస్తూ ఆరోపణలు, ప్రతి ఆరోపణలకు దిగుతున్నారు. ఆప్పల్లో ఎలాంటి ఎన్నికలు లేకపోయిన రాజకీయ వర్గాల్లో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో మొదలైన బీజేపీ కలవరం
అప్రమత్తమైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
త్వరలోనే జిల్లా రాజకీయలో భారీసమీకరణలు
ఆదిలాబాద్, డిసెంబరు 17 (ఆంరఽధజ్యోతి): దుబ్బాక, గ్రేట ర్ వరుస ఎన్నికల తరువాత ప్రజల్లో కమలం పార్టీ ఇమేజ్ పెరిగిపోవడంతో అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కమలం ఫీవర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలు సందిస్తూ ఆరోపణలు, ప్రతి ఆరోపణలకు దిగుతున్నారు. ఆప్పల్లో ఎలాంటి ఎన్నికలు లేకపోయిన రాజకీయ వర్గాల్లో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. జిల్లాలో కొద్ది రోజుల్లోనే జరగబోయే ఆదిలాబాద్ మండల జడ్పిటీసీ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో హీట్ కనిపిస్తోంది. కొంత మంది నేతలు ఇప్పుడే పార్టీ మారుదామా, లేక మరికొంత కాలం వేచి చూద్దామా అనే ధోరణితో కనిపిస్తున్నారు. ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో జరిగిన పరిణామాల వేనుక రాజకీయ కోణమే దాగిఉందన్న వాదనలు వినిపిస్తు న్నాయి. వచ్చేది జమిలి ఎన్నికలేనంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఎమిటన్నదే అంతు చిక్కడం లేదంటున్నారు. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు వస్తాయా, రావా అనే దానిపై ఇప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో చర్చ కనిపిస్తోంది. ఇలా నేతలంతా ఎవరిదారి వారే చూసుకోవడంతో అన్ని పార్టీల క్యాడర్‌లో అయోమయం కనిపిస్తోంది. మొత్తనికి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మార్పులు జరిగితే జిల్లా రాజకీయాల్లోను భారీ సమీకరణలు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కారులో కస్సుబుస్సు..
కొంతకాలంగా టీఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలు పెరిగి పోవడంతో కారు పార్టీలో కస్సు, బుస్సు మొదలైంది. అవకాశం దక్కని నేతలంతా సిట్టింగ్ ఎ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ డీలాపడిపోయినట్లే కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలంతా పార్టీలో ఉందామా.. లేకా ఇతర పార్టీలోకి వెళ్లుదామా.. అంటూ చర్చించుకోవడమే కనిపిస్తోంది. కొందరు రాష్ట్ర స్థాయి నేతలు సైతం బీజేపీ వైపు చూడడంలో కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే పరిస్థితి మారిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఉన్న పార్టీ ఓటర్లు బీజేపీ వైపే మ్మెల్యేలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ రంగినేని మనీషా, డీసీసీబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు కలల శ్రీనివాస్, రఘుపతి, ఆదిలాబాద్ మండల మాజీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, మరి కొంతమంది మైనార్టీ నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. వీరంతా అధికార పార్టీ నేతలే అయినప్పటికీ తమకు ఎమ్మెల్యే జోగు రామన్న అవకాశం దక్కకుండా అడ్డుపడ్డాడనే ఆవేశంతో రగిలిపోతున్నారు. కొన్నాళ్లుగా పార్టీ కోసమే పనిచేస్తున్న తమను పక్కన పెట్టారనే ఆవేదన వ్యక్తం అవుతోంది. కొంతకాలంగా వీరంతా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బోథ్ నియోజక వర్గంలో ముందు నుంచి మాజీ ఎంపీ గెడాం నగేష్, ఎమ్మె ల్యే రాథోడ్ బాపూరావు, రాష్ట్ర పాడిపరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డి, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ వర్గాల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తీరుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నేతలు ఒక్కటవుతున్నారు. అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీఆర్‌ఎస్ వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటమినే టార్గెట్‌గా పెట్టుకుంటూ పని చేస్తున్నారు. అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్న బీజేపీ అసంతృప్త నేతలకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే టీఆర్‌ఎస్ నుంచి భారీ చేరికలు ఉంటాయని కమలం పార్టీ నేతలు దీమాగా చెపుతున్నారు.
డీలా పడిన కాంగ్రెస్..
ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ డీలాపడిపోయినట్లే కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలంతా పార్టీలో ఉందామా.. లేకా ఇతర పార్టీలోకి వెళ్లుదామా.. అంటూ చర్చించుకోవడమే కనిపిస్తోంది. కొందరు రాష్ట్ర స్థాయి నేతలు సైతం బీజేపీ వైపు చూడడంలో కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే పరిస్థితి మారిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఉన్న పార్టీ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుచూపుతారన్నా వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు రావడంతో ఆయనతో పాటు మరికొంత మంది జిల్లా నేతలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్న నేతల మధ్య సఖ్యత లేక పోవడంతో క్యాడర్ అయోమయానికి గురిఅవుతోంది. అకస్మాత్తుగా బార్గవ్‌దేశ్‌పాండే డీసీసీ పదవీకి రాజీనామా చేయడం, ఆ వెంటనే ఇన్‌చార్జీ డీసీసీ అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను నియమించడం టీపీసీసీ ఎవరన్నది చర్చ జోరుగా సాగుతోంది.
డైలమాలో పడ్డ ఎమ్మెల్యేలు..
రోజు రోజుకూ ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరగడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు డైలామాలో పడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా పార్లమెంటు స్థానాన్ని కమలం పార్టీ కైవసం చేసుకోవడంతో మరింత ఆందోళన కనిపిస్తోంది. పైపైకి మాత్రం దీమాగానే కనిపిస్తున్న ఎమ్మెల్యేలు, బీజేపీ భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నారు. నిత్యం పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తు ద్వితీయ స్థాయి నేతలతో తరచూ టచ్‌లో ఉంటున్నారు. నియోజక వర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ పథకాలే మళ్లీ తమను గెలిపిస్తాయన్న దీమా ఇనాళ్లు కనిపించినా దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత గడ్డిగా చెప్పలేక పోతున్నారు. ఎవరు ఏ పార్టీలోకి వెలితే తమకు రాజకీయ కలిసి వస్తుందన్న అంచనాలు వేసుకుంటూ భవిషత్ రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, తరచూ బీజేపీని టార్గెట్ చేస్తు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తనానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో కొంత కమలం పార్టీ భయమే కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.