దివ్యాంగులు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T03:49:51+05:30 IST

దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

దివ్యాంగులు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి
సీడీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

-కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు3: దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికా రులతో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ‘దివ్యాంగుల స్ఫూర్తి గీతం’ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైకల్యం అనేది శరీరానికే కాని మనసుకు కాదన్నారు. అర్హులైన వారందరికీ సదరం కేంద్రాలు ఏర్పాటు చేసి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దివ్యాంగులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్య ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్వో సురేష్‌, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి సావిత్రి, తుడుందెబ్బ నాయకులు బుర్స పోచయ్య, కళకారులు హనుమండ్లు, కరుణాకర్‌, అనీల్‌, రవిశంకర్‌, విజయ్‌, జ్యోతి, కొండయ్య, సోనేరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T03:49:51+05:30 IST