‘ధరణి’ సేవలు షురూ
ABN , First Publish Date - 2020-11-03T11:03:08+05:30 IST
నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి వ్యవసాయ భూముల రిజి స్ర్టేషన్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తేదీని ఎంచు కుని తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది
నస్పూర్, నవంబరు 2: నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి వ్యవసాయ భూముల రిజి స్ర్టేషన్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తేదీని ఎంచు కుని తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. మీసేవ ద్వారానే స్లాట్ బుక్ చేయడానికి, విరా సత్, సేల్, గిఫ్ట్, కుటుంబ పంపకాలు రిజిస్ర్టేషన్లు చేసుకునే వారు ప్రభుత్వం నిర్ణయించిన వివిధ రకాల ఫీజులను మీ సేవా కేంద్రాల వద్ద చెల్లించా ల్సి ఉంటుంది. నస్పూర్‌లో సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి క్రమబ ద్దీకరణకు 54 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దా ర్ శేఖర్ తెలిపారు. నస్పూర్ పట్టణ పరిధిలోని మీ సేవా నిర్వాహకులతో తహసీల్దార్ శేఖర్ సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్, భూముల రిజిస్ర్టేష న్‌లపై వివరించారు. దరఖాస్తులు చేసే వారి ఆధా రాలు, పత్రాలు పరిశీలించి స్లాట్ బుక్ చేయాలన్నా రు. కుటుంబ పంపకాలు ఉన్నట్లయితే కచ్చితంగా సెల్ఫ్ అఫిడవిట్ ఉండాలన్నారు. మీ సేవల వద్ద ధరణి బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మీ సేవ అసోసియేషన్ అధ్యక్షుడు చకినారపు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, పాల్గొన్నారు.
కోటపల్లి: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ ముల రిజిస్ర్టేషన్‌లు, మ్యుటేషన్ సేవలను వినియో గించుకోవాలని ఎంపీపీ మంత్రి సురేఖరామయ్య, తహసీల్దార్ రామచంద్రయ్యలు కోరారు. సోమవా రం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను ప్రారంభించారు. తహసీల్దార్ ధరణిపై అవగాహన కల్పించారు. మండల స్థాయిలోనే రిజిస్ర్టేషన్ ప్రక్రి య పూర్తవుతుందని, అరగంటలో రిజిస్ర్టేషన్ పూర్త యి పది రోజుల్లో పాసు పుస్తకం ఇంటికి వస్తుం దన్నారు. ఎంపీడీవో భాస్కర్, సర్పంచు రాగం రాజ క్క, ఎంపీటీసీ శంకరయ్య, నాయకులు మంత్రి రామయ్య, రాగం స్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హాజీపూర్: ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దా ర్ మహ్మద్ జమీర్ ధరణి సేవలను ప్రారంభిం చా రు. భూములు అమ్మిన వారు, కొన్నవారు మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిం చారు. పోర్టల్ నిర్వహణ, అనుమానాలు, సమస్యల నివృ త్తికి తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. శ్రీని వాసరా వు, మందపల్లి శ్రీనివాస్, బేతు రవి, కిష్టయ్య, జాడి వెంకటేష్ పాల్గొన్నారు.
జైపూర్: ధరణి సేవలను వినియో గించుకోవాలని తహసీల్దార్ ప్రసాద్ వర్మ పేర్కొన్నారు. మీసేవా నిర్వాహ కులకు అవగాహన కల్పించారు. స్లాట్ బుకింగ్ అనంతరం భూమి అమ్మకం దారు, కొనుగోలుదారు కార్యాలయాని కి సంబంధిత డాక్యుమెంట్లు, ఇద్దరు సాక్ష్యులతో రావాలని తెలిపారు. డీటీ పోచయ్య, ఆర్‌ఐ కమల పాల్గొన్నారు.
జన్నారం: ధరణీ పోర్టల్‌ను రైతులు సద్వినియో గం చేసుకోవాలని తహసీల్దార్ పుష్పలత అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సులభతరం కోసం ధరణి పోర్టల్‌ను ప్రారంభించిం దని, రైతులు క్రయవిక్రయాలు జరిపే వారు స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ నవీ న్‌కుమార్ ఉన్నారు.
భీమిని: తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ శ్యామలాదేవి సందర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి అధికా రులకు పలు సూచనలు చేశారు. సమయపాలన పాటించాలని, విధుల్లో అలసత్వం వహించకుండా రిజిస్ర్టేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ ఇంతియాజ్ హైమ్మద్, ఉప తహసీలా ్దర్ బోర్కర్ రాంచందర్‌రావు, పాల్గొన్నారు.
కన్నెపల్లి: రైతులు ధరణి సేవలను సద్వినియో గం చేసుకోవాలని తహసీల్దార్ మున్వర్‌షరీఫ్ తెలి పారు. సోమవారం ఒక్క స్లాట్ బుక్ అయినట్లు తహసీల్దార్ తెలిపారు. గోవర్ధన్, జ్యోతి పాల్గొన్నారు.