జిల్లాలో డీజీపీ పర్యటన

ABN , First Publish Date - 2020-09-03T07:43:15+05:30 IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం జిల్లాలకు వచ్చారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హె

జిల్లాలో డీజీపీ పర్యటన

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు2: రెండు రోజుల పర్యటన నిమిత్తం డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం జిల్లాలకు వచ్చారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఇంటిలిజెన్స్‌ ఎస్పీ వేణుగోపాల్‌, ఓఎస్‌డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు  తదితరులు డీజీపీకి స్వాగతం పలికారు.


అనంతరం అధికారులతో జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు సీపీ, ఇంటలిజెన్స్‌ ఎస్పీ, ఓఎస్‌డీలతో కలిసి ఏరియల్‌ సర్వేకు బయలుదేరారు. జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత మండలాలు, ప్రాణహిత పరివాహక ప్రాంతాలను సుమారు గంట పాటు డీజీపీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక అధికారులతో డీజీపీ సమీక్షించారు.

Updated Date - 2020-09-03T07:43:15+05:30 IST