గూడెం ఆలయంలో భక్తుల పూజలు

ABN , First Publish Date - 2020-11-26T04:22:24+05:30 IST

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దండెపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం భక్తుల ప్రత్యేక పూజలు చేశారు

గూడెం ఆలయంలో భక్తుల పూజలు
సత్యదేవుడిని దర్శనం చేసుకుంటున్న భక్తులు

దండెపల్లి, నవంబరు 25: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దండెపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం భక్తుల ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా గూడెం ఆలయం చేరుకుని సత్యదేవునికి కార్తీక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ సమీపంలోగల పవిత్ర గోదావరి నదిలో పున్య స్నానాలు ఆచరించారు. నదిలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం సత్యదేవుడి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనంతో పాటు వ్రతాలను ఆచరించారు. 

Read more