ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-06-25T10:34:47+05:30 IST
జిల్లాలోని గ్రామపంచాయతీ ల్లో గల ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని కలె క్టర్ భారతి హోళికేరి అధికారులకు

కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 24: జిల్లాలోని గ్రామపంచాయతీ ల్లో గల ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని కలె క్టర్ భారతి హోళికేరి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదికారి రాజేశ్వర్, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలాదేవితో కలి సి మండలాల తహసీల్దార్లు, అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ శాఖ, రెవెన్యూ శాఖలకు సంబంధం లేకుండా వినియోగంలో లేని గ్రా మాలకు సమీపాన దాదాపు ఒక ఎకరం ప్రభుత్వ భూమిని గుర్తించి దానిలో పిల్లల పార్కు నిర్మాణంలో పాటు రైతు వేదికల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం మరింత భూమిని సేకరిం చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతీ గ్రామంలో పిల్లలతో పాటు గ్రామస్థులు వాకింగ్ చేసేందుకు పార్క్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఆసుపత్రి సంబంధిత భూమిని తీసుకోకూడదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహారీ అవతల భూమి ఉంటే ఇందుకోసం వినియోగించాలని తెలిపా రు. రైతు వేదికల నిర్మాణం కోసం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని సంబంధిత భూముల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి రెం డురోజుల్లో అందజేయాలన్నారు.
నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీవాగులతో పాటు ఇతరత్రా పూర్తి వివరాలను నీటి పారుదలకు సంబంధించి మానిటరింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడంతో పాటు ధరణి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా బై నంబర్ వచ్చినట్లయితే ఆ భూమి పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంబంధిత భూమి పూర్తి వివరా లు తీసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ని ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నర్సరీలలో నా టేందుకు మొక్కలు సిద్ధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ భూసేకరణ విభాగం పర్యవేక్షకులు మల్లికార్జున్, అధికారులు రజనీ, సుమన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
భీమిని: మండలంలోని అన్ని పంచాయతీల్లోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. బుధవారం మండలంలోని భీమి ని, కేస్లాపూర్, రాంపూర్ గ్రామాల్లో నర్సరీలను, శ్మశానవాటికలను, డంపింగ్‌యార్డు పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీల నిర్వ హణలో నిర్లక్ష్యం వహించవద్దని, ఆరో విడత హరితహారానికి సిద్ధం చేసి హరి తహారం లక్ష్యం సాధించాలన్నారు. గ్రామాల్లో ఇంకుడుగుంతలు, వైకుంఠధామా ల పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భీమిని హరితహారం నర్సరీ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమిని డంపింగ్‌యార్డు పనుల ను ప్రాంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు షోకాజు నోటీసు ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలదేవి, ఎంపీడీఓ రాఽధాకృష్ణ, సర్పంచులు ఎల్లాగౌడ్, సురేష్ పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయాలి: జడ్పీ సీఈవో
కన్నెపల్లి: మండలంలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి నరేందర్ పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో వారాంతపు సమావేశాన్ని నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చే యాల ని, మొక్కలను నాటాలని పేర్కొన్నారు. ఎంపీడీవో శంకరమ్మ, తహసీల్దార్ మల్లేష్, ఏపీవో తదితరులు పాల్గొన్నారు.