అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-11-22T04:26:58+05:30 IST

రెబ్బెన మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
తిర్యాణిలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

-కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

-పలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు

రెబ్బెన, నవంబరు21: రెబ్బెన మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం పల్లె ప్రగతి పనులను   కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ఇందిరానగర్‌లో ప్రకృతిపార్కు, గోలేటిలోని ప్రకృతి పార్కులను పరిశీలించారు. పార్కులో జరిగే పనులు తొందరగా పూర్తి చేయా లని తగు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించి ధరణి పని తీరును తహసీల్దార్‌ రియాజ్‌అహ్మద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలోని పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించి ఓటరు నమోదు తీరును అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు లిస్టులో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ సత్యనారాయణసింగ్‌, ఎంపీఓ అంజత్‌పాషా, ఏపీఓ కల్పన, సర్పంచ్‌లు సుమలత, రాజ్యలక్ష్మితో పాటు సంబంధిత కార్యదర్శులు ఉన్నారు. 


Read more